* మూడో రోజు విచారణలో రవి పొంతనలేని సమాధానాలు
* స్వయంగా రంగంలోకి దిగిన సీపీ సజ్జనార్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఐబొమ్మ, బప్పం వెబ్సైట్ల నిర్వాహకుడు ఇమ్మడి రవి (Immadi Ravi) ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. మూడు రోజు రవి విచారణ ముగిసింది. ఈరోజు స్వయంగా హైదరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ (Sajjanar) విచారణలో పాల్గొన్నారు. రవిని నేరుగా విచారించారు. సైబర్ క్రైం కార్యాలయంలో ఆయన రవిని విచారించారు. సాయంత్రం రవి విచారణ ముగిసింది. అనంతరం అడిషనల్ సీపీ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ ఇమ్మడి రవి పొంతనలేని సమాధానాలు చెబుతున్నాడని, వెబ్ సైట్ల యూజర్ ఐడీ, పాస్ వర్డ్ (Passwords) లు అడిగితే గుర్తులేదు..మరచిపోయా అంటున్నాడని అన్నారు. ఎథికల్ హ్యాకర్ల సహాయంతో ఐపీలను గుర్తిస్తామని తెలిపారు. నెదర్లాండ్స్ , ఫ్రాన్స్ లో ఐపీలు ఉన్నట్లు ఇప్పటికే గుర్తించామన్నారు. రవి ప్రతీ 20 రోజులకు ఫారిన్ ట్రిప్ కు వెళ్తాడని వెల్లడించారు. సంపాదించిన డబ్బును ఎప్పటికప్పుడు ఖర్చు చేసేస్తాడన్నాడు. రవి బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తున్నామని, అతడి స్నేహితుడు నిఖిల్, వాళ్ల చెల్లికి పలుమార్లు డబ్బు బదిలీ చేసినట్లు గుర్తించామన్నారు. నిఖిల్ పోస్టర్స్ డిజైన్ చేసి ఇచ్చేవాడని తెలిపారు.
