
* నిఖారైన ఉద్యమ బిడ్డను
*కాంగ్రెస్ పార్టీకి కమిట్ మెంట్ లేదు
* ఇప్పటికైనా మోసాలు ఆపాలి
* మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్
ఆకేరు న్యూస్ హుజురాబాద్ : తెలంగాణ చరిత్ర రాస్తే ఐదు పేజీల చరిత్ర తనదే ఉంటుందని నిఖారైన ఉద్యమ బిడ్డను అని ఈటెల రాజేందర్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలే ముఖ్యమని తనకు పదవులు ముఖ్యం కాదని ఈటెల అన్నారు.కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదని ఈటెల ఆరోపించారు.గత పది రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా.. వార్డు మెంబర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, జడ్పీ చైర్మన్లు కావాలి అనుకునే వారు ఆందోళనలో ఉన్నారని ఈటెల అన్నారు. ఈ గందరగోళానికి సీఎం రేవంత్ రెడ్డే కారణమని ఆరోపించారు. తెలంగాణలో 85 శాతం మంది బడుగు బలహీన వర్గాలు ఉన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని కామారెడ్డిలో కాంగ్రెస్ డిక్లరేషన్ చేసిన విధంగా అమలు చేయాలని భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి డిమాండ్ చేస్తుందన్నారు .ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ చెంపలు వేసుకుని క్షమాపణ చెప్పి వెంటనే ఎన్నికలు జరిపించాలని డిమాండ్ చేస్తున్నాను. గాంధీ గారు చెప్పినట్లు గ్రామ స్వరాజ్యం జరగాలంటే గ్రామ సచివాలయాలు, మండల కార్యాలయాలు, జిల్లా పరిషత్తులు గొప్పగా నడపాలన్నారు. 73, 74 వ రాజ్యాంగ సవరణ రాజీవ్ గాంధీ గారి తీసుకొచ్చారనే విషయాన్ని కాంగ్రెస్ వారు మర్చిపోతున్నారని ఈటెల అన్నారు.
…………………………………….