ఆకేరు న్యూస్, ములుగు:ములుగు జిల్లాలో తాడ్వాయి మండలం కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ రాంపాక అవిలయ్య, NSS ఆద్వర్యంలో తెలంగాణ రాష్ట్ర రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ ఏటూరు నాగారం అదికారుల బృందం ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగే అగ్ని ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో ఫైర్ పార్ట్మెంట్ అధికారులు రవి కుమార్, శ్రీకాంత్, ప్రవీణ్ లతోపాటు తాడ్వాయి HP గ్యాస్ సంస్థ సిబ్బంది గ్యాస్ సిలిండర్ల భద్రత గురించి అవగాహన కల్పించారు.కళాశాల ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ కొమ్మాల సంధ్య, కిషన్, భిక్షం, రాజు, అశోక్, శ్రీలత, యాకూబ్ శివశంకర్ విద్యార్థిని విద్యార్థులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

………………………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
