* తెలంగాణ తల్లిపై ప్రేమ లేదు కాబట్టే రూపం మార్చారు
* ఎమ్మెల్సీ కవిత
ఆకేరు న్యూస్, హైదరాబాద్: మన సంస్కృతిపై దాడి జరుగుతుంటే ప్రతీ ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో శనివారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అధ్యక్షతన జరిగిన ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి దేశపతి శ్రీనివాస్, మాజీ ప్రభుత్వ సలహాదారు రమణాచారి, వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, జూలూరి గౌరీ శంకర్, ఆయాచితం శ్రీధర్, తేలు విజయ, దేవీప్రసాద్, కవులు, కళాకారులు హాజరయ్యారు. తెలంగాణ తల్లి విగ్రహం రూపం మార్పు, తెలంగాణ అస్థిత్వం తదితర అంశాలపై జాగృతి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా అమరవీరుల స్థూపం, తెలంగాణ తల్లి విగ్రహానికి కవిత పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ ఉద్యమం సమయం నుంచి ఉన్న తెలంగాణ తల్లినే ఆరాధిస్తామన్నారు. తెలంగాణ తల్లిపై ప్రేమ లేదని.. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి రూపం మార్చారన్నారు. తెలంగాణ తల్లి చేతిలో ఉన్న బతుకమ్మను చూస్తే తెలంగాణ సమాజాన్ని చూసినట్లుంటుందని.. అందరం కలిస్తేనే ఒక అందమైన బతుకమ్మ అవుతుందన్నారు. అందరం కలిస్తేనే అందమైన సమాజం అవుతుందన్న సందేశం ఇచ్చేది బతుకమ్మ అన్నారు.
………………………………..