
* బీఆర్ ఎస్తో దోస్తీ వల్లే ఆప్ ఓటమి
* కడియం శ్రీహరి
ఆకేరు న్యూస్, వరంగల్ : గత ప్రభుత్వంలో పదేళ్ల పాటు ఎలాంటి అభివృద్ధి జరగలేదని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari) అన్నారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ కోర్టు పరిధిలో ఉందని, అనర్హతపై కోర్టు తీర్పును శిరసావహిస్తానని తెలిపారు. ఉప ఎన్నిక వస్తే పారిపోనని, నిలబడి పోరాడతానని తెలిపారు. ఫిరాయింపులపై మాట్లాడే అర్హత బీఆర్ ఎస్(BRS)కు లేదన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిహసించిందే బీఆర్ ఎస్ అన్నారు. ఎస్సీలకు జనాభా ప్రాతిపదికన 18 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కోరారు. ఢిల్లీలో బీజేపీ గెలిస్తే, ఇక్కడ కేటీఆర్ సంతోషపడుతున్నారని, ఆప్ (AAP)ఓటమికి కారణం.. బీఆర్ ఎస్తో స్నేహం చేయడమే అని తెలిపారు. కాంగ్రెస్, ఆప్ కలిసి పోటీ చేస్తే విజయం సాధించేవని తెలిపారు.
………………………………………