
* సీఎస్‌ను కాపాడాలనుకుంటే చెట్ల పునరుద్దరణపై పక్కా ప్రణాళికతో రావాలి
* పర్యావరణ పునరుద్దరణ తప్ప మాకు మిగతా అంశాలు అనవసరం
* కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టులో విచారణ
ఆకేరు న్యూస్, డెస్క్ : కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు(Supreme Court) లో విచారణ ప్రారంభమైంది. చెట్లు కొట్టే ముందు అనుమతులు తీసుకున్నారో, లేదో స్పష్టంగా చెప్పాలని జస్టిస్ గవాయ్ ప్రభుత్వ తరఫు లాయర్‌ను ప్రశ్నించారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం నడుచుకున్నారా అని ప్రశ్నించారు. అనుమతి లేకుండా చెట్లు కొట్టినట్లు నిరూపణ అయితే, సీఎస్(CS), అధికారులు జైలుకు వెళ్తారని జస్టిస్ గవాయ్ హెచ్చరించారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించకపోతే ఊరుకోబోమని హెచ్చరించారు. ఈ విషయంలో సీఎస్ ను కాపాడాలి అనుకుంటే, విధ్వంసం సృష్టించిన ఆ 100 ఎకరాలను ఎలా పునరుద్ధరిస్తారో చెప్పాలని ప్రభుత్వ తరఫున లాయర్‌ను ప్రశ్నించారు. 4 వారాల్లో ప్రణాళికలు ఇవ్వాలని ఆదేశించింది. అనుమతులు తీసుకునే చెట్లు, పొదలు తొలగించామని ప్రభుత్వ తరఫు లాయర్ బదులిచ్చారు. మినహాయింపునకు లోబడే చెట్లు తొలగించామని, ప్రస్తుతం అక్కడ పనులు ఏమీ చేపట్టడం లేదని కోర్టుకు వివరించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కానివ్వబోమని కోర్టుకు విన్నవించారు. 2004 నుంచి కంచ గచ్చిబౌలి(Gachibowli)లో చేపట్టిన ప్రాజెక్టుల వివరాలను కోర్టుకు వివరించారు. రూ. 10 వేల కోట్లకు మార్టిగేజ్ చేసినట్లు నివేదిక పేర్కొందని అమికస్ క్యూరీ పేర్కొన్నారు. భూములు మార్టిగేజ్ చేసుకున్నారో, అమ్ముకున్నారో తమకు అనవసరమని, చెట్లు కొట్టే ముందు అనుమతి ఉందా లేదనేదే ముఖ్యమని తెలిపారు. వంద ఎకరాల్లో జరిగిన నష్టాన్ని ఎలా పూడ్చాలో, జంతు జాలాన్ని ఎలా రక్షిస్తారో చెప్పాలని ధర్మాసనం పేర్కొంది. పర్యావరణ పునరుద్దరణ తప్ప మిగతా అంశాలు తమకు అవసరం లేదని గవాయ్ పేర్కొన్నారు. చెట్ల పునరుద్ధరణపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రణాళికతో రావాలని ఆదేశించింది. కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. జస్టిస్ బీఆర్ గవాయ్(Justice Br Gaway), జస్టిన్ అగస్టిన్ జార్జ్ తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టనుంది. ఏప్రిల్ 3న జరిగిన విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ప్రతివాదిగా సుప్రీంకోర్టు చేర్చింది. ఈనెల 16లోపు అఫిడవిట్ సమర్పించాలని ఆదేశించింది. క్షేత్ర స్థాయికి వెళ్లి పరిశీలించి నివేదిక సమర్పించాలని కేంద్ర సాధికార కమిటీ (సీఈసీ)ని ఆదేశించిన విషయం తెలిసిందే. దీనిపై ఈరోజు విచారణ జరిగింది. వాదాపవాదలు విన్న ధర్మాసనం.. తీర్పు విషయంలో స్టేటస్ స్టే కో కొనసాగుతుందని తెలిపింది. తదుపరి విచారణను మే 15కు వాయిదా వేసింది.
……………………………………………………..