
* భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు
ఆకేరున్యూస్, భూపాలపల్లి: మత సామరస్యాలకు ప్రతీక ఇఫ్తార్ విందు కార్యక్రమం అని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు తెలిపారు. ఆదివారం భూపాలపల్లి భారత్ ఫంక్షన్ హాలులో రాష్ట్ర ప్రభుత్వం తరుపున ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. ముస్లింలు రంజాన్మాశాన్ని భక్తిశ్రద్ధలతో కఠోర ఉపవాసాలతో నిర్వహిస్తారన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో ఆచరించే ఉపవాస దీక్షలు ముస్లిం సోదరులకు ఇచ్చే ఇఫ్తార్ విందు లాంటి కార్యక్రమాలు ప్రజలలో సోదర భావాన్ని పెంపొందిస్తాయని ఈ సందర్భంగా రంజాన్ మాస విశిష్టతను కొనియాడారు. అన్ని మతాల సారాంశం ప్రజలందరూ సోదర భావంతో జీవించాలని అన్నారు. సామూహిక నమాజ్ అనంతరం ఉపవాస దీక్ష చేపట్టిన ముస్లింలకు ఫలహారాలు తినిపించి ఉపవాస దీక్ష విడిపించారు.ఈ కార్యక్రమంలో ముస్లింలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
……………………………………………