– హాథ్రాస్ తొక్కిసలాటలో 121కి చేరిన మృతుల సంఖ్య
ఆకేరు న్యూస్ డెస్క్ : ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) లోని హాథ్రాస్ (Hathras) లో వెదికే కొద్దీ మృతదేహాలు లభ్యం అవుతున్నాయి. గాయాలపాలై చికిత్స పొందుతున్న వారిలో మరికొందరు మృత్యువాత పడ్డారు. దీంతో తొక్కిసలాట (Stampede) లో చనిపోయిన వారి సంఖ్య 121కు చేరింది. దర్యాప్తులో భాగంగా ఫోరెన్సిక్ నిపుణులు (Forensic experts) తొక్కిసలాట జరిగిన ప్రాంతంలో ఆధారాల కోసం గాలిస్తున్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహించిన వారిపై భారతీయ న్యాయ సంహిత చట్టం (Indian Code of Law) లోని 105, 110, 126(2), 223, 238 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేశారు. ఆ కార్యక్రమానికి ముఖ్య సేవదార్‌గా ఉన్న దేవ్‌ప్రకాశ్ మధుకర్ (Devprakash Madhukar) పై కేసు బుక్ చేశారు. బోలే బాబా ఆశ్రమం (Baba’s Ashram)లో ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.
హైకోర్టులో పిటిషన్
హాథ్రాస్ తొక్కిసలాట ఘటన (Hathras Stampede incident) పట్ల సీబీఐ దర్యాప్తు (CBI investigation) చేపట్టాలని అలహాబాద్ హైకోర్టు(Allahabad High Court) లో అడ్వకేట్ గౌరవ్ ద్వివేది (Advocate Gaurav Dwivedi) పిల్ దాఖలు చేశారు. ఘటన జరిగిన ప్రాంతం వద్ద డాగ్ స్క్వాడ్‌తో ఫోరెన్సిక్ నిపుణులు సెర్చ్ చేస్తున్నారు. మరోవైపు మెయిన్‌పురి జిల్లాలో ఉన్న బోలే బాబాకు చెందిన రామ్ కుటీర్ ఛారిటబుల్ ట్రస్టు (Ram Kutir Charitable Trust) ఆశ్రమానికి భక్తులు వచ్చిపోతున్నట్లు డిప్యూటీ ఎస్పీ సునిల్ కుమార్ (Deputy SP Sunil Kumar) తెలిపారు. ఆశ్రమానికి రాకుండా ఎవరినీ ఆపడం లేదన్నారు.
————————