ఆకేరు న్యూస్ డెస్క్ : కంచన్ జంగా ఎక్స్‌ప్రెస్ (Kanchan Janga Express) ప్రమాదం ఘటన మరవక ముందే మళ్ళీ రైలు ప్రమాదం చోటు చేసుకుంది. హౌరా (Howrah) నుంచి ముంబై (Mumbai) వెళ్తున్న హౌరా మెయిల్ జార్ఖండ్ (Jharkhand) లోని చక్రధర్పూర్ (Chakradharpur) లో పట్టాలు తప్పింది. గూడ్స్ రైలు (Goods train) పట్టాలు తప్పి పక్క ట్రాక్‌పై పడింది. అదే లైనులో వస్తున్న హౌరా – సీఎస్ఎంటీ ఎక్స్‌ప్రెస్ (CSMT Express) ఆ బోగీలు ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో 18 మంది చిన్నారులు కూడా ఉన్నట్లు సమాచారం. అయితే రైల్వే సిబ్బంది, స్థానిక పోలీసులు ఇంకా మరణాలను ధృవీకరించలేదు. మంగళవారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో రాజ్ఖర్స్వాన్ (Rajkharswan), బడాబాంబో (Badabambo) మధ్య ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో హౌరా మెయిల్ పశ్చిమ బెంగాల్‌లోని హౌరా నుంచి సీఎస్ఎంటీ ముంబైకి వెళ్తోంది.,
————————–