* కెనడా, గ్రీన్‌ల్యాండ్ మధ్య గుర్తించిన శాస్త్రవేత్తలు
ఆకేరు న్యూస్ డెస్క్ : ఇప్పటి వరకు బాహ్య ప్రపంచానికి తెలియని ఓ చిన్న ఖండం వెలుగులోకి వచ్చింది. కెనడా (Canada), గ్రీన్‌ల్యాండ్ (Greenland) మధ్య ఆ ఖండం ఉన్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. ‘డేవిస్ జలసంధి’ (Davis Strait) కిందే ఈ ‘సూక్ష్మ ఖండం’ ఉందని పరిశోధకులు గుర్తించారు. ఉప్పాసలా యూనివర్సిటీ (Uppsala University) (స్వీడన్), డెర్బీ యూనివర్సిటీ (University of Derby) (యుకే)కి చెందిన భూగర్భ శాస్త్రవేత్తలు (Geologists) ఈ ఖండాన్ని కనుగొన్నారు. శాస్త్రవేత్తల బృందం ఇక్కడి టెక్టోనిక్ ప్లేట్ కదలికలపై అధ్యయనం (A study of tectonic plate movements) చేస్తుండగా, ఈ ప్రాంతంలో 402 కిలోమీటర్ల పొడవుతో కూడిన చిన్నపాటి ఖండం ఉందన్న సంగతి బయటపడింది. ఈ ఖండం దాదాపు 6 కోట్ల సంవత్సరాల (6 crore years) క్రితం ఏర్పడిందని శాస్త్రవేత్తలు (Scientists) చెబుతున్నారు.
———————-