
హీరోయిన్ జాన్వీకపూర్
ఆకేరు న్యూస్ డెస్క్ : బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరోయిన్ జాన్వీకపూర్ (Heroine Janhvi Kapoor) ఫుడ్ పాయిజన్ (Food poisoning) తో గురువారం ఆస్పత్రిలో చేరారు. మూడు రోజుల చికిత్స అనంతరం ఈరోజు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి (Discharge) అయ్యారు. ప్రస్తుతం ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారని ఆమె తండ్రి బోనీ కపూర్ (Boney Kapoor) వెల్లడించారు. ఫుడ్ పాయిజన్ కారణంగా అస్వస్థతకు గురైన జాన్వీ కపూర్ (Janhvi Kapoor) గత గురువారం ముంబైలోని ఓ ఆస్పత్రి (Mumbai hospital) లో చేరింది. ప్రస్తుతం జాన్వీ కోలుకోవడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గత కొన్ని రోజులుగా బిజీ షెడ్యూల్స్‌తో గడుపుతున్న జాన్వీ.. గత వారం అంబానీ పెళ్లి వేడుకలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు.
——————–