* నిబంధనలకు విరుద్దంగా రిజిస్ట్రేషన్లు
ఆకేరు న్యూస్, వరంగల్ : రిజిస్ట్రేషన్ కార్యలయాల్లో అక్రమాల పరంపర కొనసాగుతూనే ఉంది. అవకాశం దొరికితే చాలు అవినీతికి పాల్పడడం అలవాటుగా మారిపోయింది. తాజాగా అక్రమాలకు పాల్పడ్డ సబ్ రిజిస్ట్రార్ పై ఉన్నతాధికారులు శనివారం సస్పెన్సన్ వేటు వేశారు. ఖిలా వరంగల్ రిజిస్ట్రార్ సెలవులో వెళ్ళారు. రాజేశ్ ( Rajesh ) అనే సబ్ రిజిష్ట్రార్‌కు ఇంచార్జీ బాధ్యతలు అప్పగించారు. ఇదే అదనుగా ఇంఛార్జి సబ్ రిజిస్ట్రార్ ఒక అక్రమ వెంచర్ లో సుమారు 26 డాక్యుమెంట్లకు డీల్ కుదుర్చుకొని రిజిస్ట్రేషన్ చేసినట్లు అధికారులు గుర్తించారు . రిజిష్ట్రేషన్ శాఖ డీఐజి సుభాషిణి ఆదేశాల మేరకు రిజిస్ట్రార్ రవి, ఇంఛార్జి సబ్ రిజిస్ట్రార్ గా పని చేసిన రాజేశ్‌ను సస్పెండ్ చేశారు. ఇంచార్జీ కాలంలో ఆయన రిజిష్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్ల పైన పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు.
——————————————————————-