India vs New Zealand Test
* భారత్ విజయానికి బ్రేక్..
* డ్రాగా ముగిసిన తొలి టెస్టు!
* WTC పట్టికలో మారిన లెక్కలు
ఆకేరు న్యూస్, స్పోర్ట్స్ : న్యూజిలాండ్ గడ్డపై భారీ ఆధిక్యం సాధించిన టీమిండియాకు తొలి టెస్టులో (India vs New Zealand Test) నిరాశ ఎదురైంది. వెల్లింగ్టన్లోని బేసిన్ రిజర్వ్ వేదికగా జరిగిన భారత్, న్యూజిలాండ్ తొలి టెస్టు ఉత్కంఠభరిత పోరాటం అనంతరం డ్రాగా ముగిసింది. చివరి రోజు న్యూజిలాండ్ బ్యాటర్లు అద్భుతమైన పట్టుదల కనబరిచి వికెట్లు కాపాడుకోవడంతో భారత జట్టుకు విజయం దక్కలేదు.
తొలి ఇన్నింగ్స్‌లో (India vs New Zealand Test) న్యూజిలాండ్ 368 పరుగులకు ఆలౌట్ కాగా, భారత్ 9 వికెట్ల నష్టానికి 720 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. దీంతో టీమిండియాకు 352 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. రెండో ఇన్నింగ్స్‌లో కివీస్‌ను త్వరగా ఆలౌట్ చేసి మ్యాచ్ గెలవాలని భావించిన భారత బౌలర్లకు చివరి రోజు బ్యాటర్లు అడ్డుగోడలా నిలిచారు.
* మిచెల్, ఫిలిప్స్ అద్భుత పోరాటం..
చివరి రోజు ఓవర్‌నైట్ బ్యాటర్లు డెవాన్ కాన్వే (65), రచిన్ రవీంద్ర (37)లను భారత బౌలర్లు పెవిలియన్‌కు పంపడంతో టీమిండియాలో విజయంపై ఆశలు చిగురించాయి. ఆ తర్వాత టామ్ బ్లండెల్ వికెట్ కూడా పడటంతో న్యూజిలాండ్ ఒత్తిడిలో పడింది. ఈ దశలో డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ కీలక బాధ్యత తీసుకున్నారు. భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ వికెట్లు పడకుండా జాగ్రత్తగా ఆడారు.
డారిల్ మిచెల్ 186 బంతులు ఎదుర్కొని అజేయంగా 49 పరుగులు చేయగా, గ్లెన్ ఫిలిప్స్ 126 బంతుల్లో 26 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు అజేయంగా 63 పరుగులు జోడించారు. సుమారు 43 ఓవర్ల పాటు వికెట్ పడకుండా పోరాడి జట్టును ఓటమి నుంచి గట్టెక్కించారు.
భారత బౌలర్లు వికెట్లు తీసేందుకు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఫలితం దక్కలేదు. ముఖ్యంగా డారిల్ మిచెల్‌ను రనౌట్ చేసే అవకాశాన్ని ఆకాశ్ దీప్ చేజార్చడం టీమిండియాకు నిరాశ కలిగించింది.
* 239/5తో ముగిసిన కివీస్ రెండో ఇన్నింగ్స్
చివరకు న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 120 ఓవర్లకు 5 వికెట్ల నష్టానికి 239 పరుగులు చేసింది. మరో 16 ఓవర్లు మిగిలి ఉండగానే మ్యాచ్‌లో ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో ఇరు జట్ల కెప్టెన్లు డ్రాకు అంగీకరించారు. దీంతో భారీ ఆధిక్యం సాధించినప్పటికీ భారత్ విజయాన్ని అందుకోలేకపోయింది.
* హెన్రీ నికోల్స్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్..
న్యూజిలాండ్ తరఫున హెన్రీ నికోల్స్ భారీ శతకంతో రాణించాడు. అతడికి ఈ మ్యాచ్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది. భారత్ తరఫున తొలి ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ శతకాలతో ఆకట్టుకోగా, యశస్వి జైస్వాల్, దేవ్‌దత్ పడిక్కల్, శుభ్‌మన్ గిల్, ధ్రువ్ జురెల్ అర్ధశతకాలతో రాణించారు.

* WTC పాయింట్ల పట్టికలో మార్పులు..
ఈ మ్యాచ్ డ్రాగా ముగియడంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (WTC) పాయింట్ల పట్టికలో ఇరు జట్ల గెలుపు శాతాలపై ప్రభావం పడింది. న్యూజిలాండ్ గెలుపు శాతం 72.33 నుంచి 66.67కు తగ్గడంతో ఆ జట్టు మూడో స్థానానికి పరిమితమైంది. మరోవైపు భారత్ గెలుపు శాతం 51.52 నుంచి 50కి తగ్గినప్పటికీ నాలుగో స్థానాన్ని కొనసాగించింది.
Also Read : భారత్ భారీ ఆధిక్యం..!
తొలి టెస్టులో విజయం సాధించలేకపోయిన భారత్.. తదుపరి మ్యాచ్‌లో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. ఇరు జట్ల మధ్య రెండో టెస్టు శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది.
A draw it is in the Wellington Test.
Both teams share the honours after a hard-fought contest.
#TeamIndia will now aim to win the series in the 2nd #NZvIND Test in Christchurch 🇮🇳
Scorecard ▶️ https://t.co/SaMcNXtAVG https://t.co/GF8A2ALHbD
— BCCI (@BCCI) November 23, 2026

Please tell us what is wrong. Your report will be sent to the website team.

