* ఫైనల్ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా సఫారీలపై 52 పరుగులతో విజయం
* ఆల్ రౌండ్ ప్రతిభ కనబర్చిన షఫాలీ వర్మ, దీప్తి శర్మ
* కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన సౌత్ ఆఫ్రికా కెప్టెన్ లారా ఓల్వార్ట్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : భారత ప్రజల 47 ఏళ్ల కల సాకారం అయింది రెండు స్తార్లు ఊరించి దక్కకుండా పోయిన వరల్డ్ కప్ ముచ్చటగా మూడో సారి వరించింది. నవీ ముంబై లోని డీవై పాటిల్ స్టేడియంలో ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్ లో భారత మహిళా జట్టు సౌత్ ఆఫ్రికా జట్టును 52 పరుగుల తేడా తో ఓడించింది. టాస్ గెలిచిన సౌత్ ఆఫ్రికా కెప్టెన్ లారా ఓల్వర్టు మందుగా ఫీల్డింగ్ ఎంచుకొంది. ముందుగా బ్యాటింగ్ ప్రరంభంచిన భారత జట్టు మొత్తం 298 పరుగులు చేసింది. షఫాలీ వర్త అద్భుత ప్రతిభ కనబర్చి 87 పరుగులతో భారత్ కు భరీ స్కోరుకు కారణమైంది. దీప్తి శర్మ 58, స్మృతి మందాన 45 పరుగులతో భారత్ కు గౌరవ ప్రదమైన స్కోరును అందించారు.
మలుపు తిప్పిన షఫాలీ
ఫైనల్ మ్యాచ్ ను షఫాలీ వర్మ మలుపు తిప్పిందనే చెప్పాలి . ఫైనల్ లో సెంచరీ సాధిస్తుందనుకున్న షఫాలీదురదృష్ట వశాత్తు 87 పరుగుల వద్ద ఔట్ అయింది. అయితే కెప్టెప్ హరిప్రీత్ కౌర్ ఊహించని విధంగా షఫాలీ వర్మకు బౌలింగ్ ఇవ్వడంతో కీలక సమయంలో రెండు వికెట్లు తీసి మొతం గేమ్ నే మలుపు తిప్పింది.
ప్లేయర్ ఆఫ్ దీ టోర్నీ దీప్తి
షఫాలీ వర్మ ఔట్ కావడంతో భారత్ జట్టు ఒక్కసారిగా నిరాశకు గురికాగా దీప్తి శర్మ నేనున్నానంటూ బరిలోకి దిగి సౌత్ ఆఫ్రికా బౌలర్లను చితక బాదింది. 58 పరుగులు చేసి రనౌట్ అయింది. బౌలింగ్ లో 5 కీలక వికెట్లు తీసింది. మొత్తం టోర్న మెంట్ లో అద్భుత ప్రతిభ కనబర్చి ప్రేయర్ ఆఫ్ దీ టోర్నీ గా నిలిచింది. టోర్నమెంట్ మొత్తంలో 215 పరుగులు చేసి 22 వికెట్లు పడగొట్టింది.
కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన లారా వోల్వార్ట్
సౌత్ ఆఫ్రికా జట్టు ఫైనల్ లో ఓడిపోయినా ఆ జట్టు కెప్టెన్ లారా వోల్వర్టు ఆట అందరిటీ ఆకట్టుకుంది, నింపాదిగా ఆడుతూ ఎక్కడా తడపడకుండా జట్టుకు ధైర్యంగా నిలుస్తూ ముందుకు సాగింది. సెమీ ఫైనల్ లో ఇంగ్లండ్ పై 165 పరుగులు చేసి నాటౌట్ గా నిలచిన వోల్వా ఫైనల్ లో 101 దురదృష్ట వశాత్తు క్యాచ్ అవుట్ అయి వెనుతిరిగింది.
ఆకట్టుకున్న తెలుగమ్మాయి
ఫైనల్ మ్యాచ్ లో తెలుగమ్మాయి తన ప్రత్యేకతను చాటుకుంది. బౌలింగ్ లో అత్యంత ప్రతిభ కనబర్చింది. సౌత్ ఆఫ్రికా బ్యాట్స్ఉమెన్లను కట్టడి చేసి పరుగులను నియంత్రించింది. శ్రీ చరణి బౌలింగ్ కు రావడంతో సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ లో పరుగుల వేగం తగ్గింది. దీంతో సౌత్ ఆఫ్రికా ఆటగాళ్లపై మరింత ఒత్తడి పెరిగింది. చాలా పొదుపుగా పరుగులు ఇచ్చిన శ్రీ చరణి కీలక సమయంలో ఓ వికెట్ కూడా తీసింది.
ఫలించిన కల
రెండు సార్లు వచ్చినట్లు వచ్చి చేజారిన వరల్డ్ కప్ ను మూడో సారి భారత మహిళలు అద్భుతంగా ఆడి చేజిక్కించుకున్నారు.గతంలో రెండుసార్లు ఫైనల్లో పరాజయం పాలైన టీమిండియా.. ఈసారి మాత్రం కప్పును ఒడిసిపట్టింది. దీంతో ఈ ఫీట్ సాధించిన నాలుగో జట్టుగా అవతరించింది.మహిళల వన్డే ప్రపంచకప్ 2025 విజేతగా భారత్ నిలిచింది. సొంతగడ్డపై జరిగిన ఈ మెగా ఈవెంట్లో ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. ఓ దశలో హ్యాట్రిక్ ఓటములు ఎదురైనా.. బలంగా పుంజుకుంది. హ్యాట్రిక్ ఓటముల తర్వాత వరుసగా నాలుగు విజయాలు సాధించి.. తొలి టైటిల్ ఖాతాలో వేసుకుంది.
1973లో తొలిసారి వన్డే ప్రపంచకప్ నిర్వహించారు. అందులో ఇంగ్లాండ్ విజేతగా నిలిచింది. వన్డే ప్రపంచకప్ చరిత్రలో ఎక్కువసార్లు ఆస్ట్రేలియా జట్టే విజేతగా నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో ఇంగ్లాండ్ ఉంది. ఇంగ్లాండ్ నాలుగు సార్లు టైటిల్ ఎగరేసుకుపోయింది. ఒకసారి న్యూజిలాండ్ గెలుపొందిందిఈసారి మాత్రం సీన్ రివర్స్ అయింది. టీమిండియా కొత్త ఛాంపియన్గా అవతరించింది. దీంతో మహిళల వన్డే ప్రపంచకప్ టైటిల్స్ సాధించిన జట్ల జాబితాలో చేరిపోయింది.మహిళల వన్డే ప్రపంచకప్ టైటిల్ సాధించిన నాలుగో జట్టుగా భారత్ అవతరించింది. ఆదివారం ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించి ఈ ఫీట్ సాధించింది.
…………………………………………
