
ఆకేరు న్యూస్, స్పోర్ట్స్ డెస్క్ : వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను భారత్ కైవసం చేసుకుంది. రెండు టెస్టుల్లోనూ విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకుంది. రెండో టెస్టులో ఆఖరి రోజున ఆటను 63/1 స్కోరుతో ప్రారంభించిన భారత్ ఆ తరువాత మరో రెండు వికెట్ల నష్టానికి 121 లక్ష్యాన్ని సునాయాసంగా పూర్తి చేసింది. కేఎల్ రాహుల్ (ఓవర్ నైట్ స్కోరు 25) 58 పరుగులు సాధించి అర్ధశతకంతో మెరిశాడు. 30 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో బరిలోకి దిగిన సాయి సుదర్శన్ 39 పరుగులు చేశాడు. విండీస్ బౌలర్ రోస్టన్ ఛేజ్ 2 వికెట్లు తీయగా, జోమెల్ వారికన్ ఒక వికెట్ తీశాడు. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా ఆటగాళ్లు అదరగొట్టడంతో భారత్ 518/8 వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. శుభమన్ గిల్ (129), యశస్వి (175), ధ్రువ్ జురెల్ అద్భుత ఆటతీరుతో జట్టు విజయానికి బాటలు వేశారు. ఇక బౌలింగ్‌లోనూ భారత్ సత్తా చాటడంతో విండీస్ 248 పరుగులకే కుప్ప కూలి ఫాలో ఆన్ ఆడింది. కుల్దీప్ యాదవ్ 5 వికెట్లు తీయగా, జడేజా 3 వికెట్లు తీసి జట్టుకు కీలకంగా నిలిచారు. తమ ఇన్నింగ్స్‌లో ఈసారి అద్భుత పొరాట పటిమనను కనబరిచిన విండీస్ ప్లేయర్లు క్రికెట్ అభిమానులను మెప్పించగలిగారు. కాంప్‌బెట్(115), షై హోప్ (103), జస్టిన్ గ్రీవ్స్ (50), రోస్టన్ ఛేజ్ (40), జైడెన్ సీల్స్ (32) రాణించారు.
……………………………………………….