* ఎయిర్ పిస్టల్ లో మను బాకర్ కు కాంస్యం
ఆకేరు న్యూస్ స్పోర్ట్స్ డెస్క్ : పారిస్ ఒలింపిక్స్ (Paris Olympics) లో భారత్ (India) బోణీ కొట్టింది. తొలి పతకం అందుకుంది. ఎయిర్ పిస్టల్ (Air pistol) విభాగంలో మను బాకర్ (Manu Bakar) కాంస్యం సాధించారు. షూటింగ్ 10 మీటర్ల విభాగంలో ఆయన ఈ విజయం కైవసం చేసుకున్నారు. శనివారం జరిగిన వేర్వేరు ఈవెంట్లలో భారత్‌కు చెందిన ఇతర షూటర్లు నిరాశ పరిచినప్పటికీ 10 మీటర్ల ఉమెన్స్ ఎయిర్ పిస్టల్ క్వాలిఫికేషన్ రౌండ్ (Women’s Air Pistol Qualification Round) లో మను భాకర్ ఫైనల్లో అడుగుపెట్టింది. హంగేరి క్రీడాకారిణి వెరోనికా మేజర్ (Hungarian player Veronika Major) 582 స్కోర్‌తో అగ్రస్థానంలో నిలవగా.. 580 స్కోరుతో మను భాకర్ మూడవ స్థానంలో నిలిచింది. కాగా నేడు జరిగిన ఫైనల్ రౌండ్ లో మను బాకర్ కాంస్యం సాధించారు. .
పీవీ సింధు శుభారంభం.. తొలి రౌండ్లో విజయం
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు (Indian star shuttler PV Sindhu) శుభారంభం చేశారు. తొలి రౌండ్లో ఘన విజయం సాధించారు. ఫ్రాన్స్ రాజధాని (Capital of France) లో జరుగుతున్న ఈ ఒలింపిక్ క్రీడల్లో తెలుగమ్మాయి సింధు తన ప్రత్యేకతను చాటిచెప్పింది. తొలి మ్యాచ్‌లో ఆమె మాల్దీవుల (Maldives) కు చెందిన క్రీడాకారిణి (Sportswoman) ఫతీమత్ నబాబా అబ్దుల్ రజాక్ (Fatima Nababa Abdul Razak) పై సునాయాసంగా గెలవగలిగారు. ఈ మ్యాచ్‌లో రజాక్.. సింధుకు ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. సింధు కేవలం 29 నిమిషాల్లోనే వరుసగా రెండు సెట్లలో మాల్దీవ్స్ క్రీడాకారిణిని చిత్తుచేసింది. రెండు సెట్లలో 21-9, 21-6 తేడాతో సింధు గెలిచింది. సింధు తన రెండో గ్రూప్ మ్యాచ్‌లో ఎస్తోనియా షట్లర్ క్రిస్టిన్ కూబా (Estonia shuttler Kristin Kuba) తో తలపడనున్నారు. జూలై 31న ఈ మ్యాచ్ జరగనుంది. కాగా సింధుకు ఒలింపిక్స్‌లో పాల్గొనడం ఇది మూడోసారి. ఆమె 2016 రియో ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని, 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు.
————————-