* కాళేశ్వరంపై కేటీఆర్ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం
* బీఆర్ ఎస్ హయాంలో ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారు
* మేడిగడ్డను ముంచేశారు..
* ప్రాధాన్యతా ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయండి
* నీటి పారుదల శాఖ సమీక్షలో మంత్రి ఉత్తమ్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ప్రాధాన్యం గల ప్రాజెక్టులను సాధ్యమైనంత త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలి అని అధికారులను నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) ఆదేశించారు. అధికారులకు అప్పగించిన పనులను సకాలంలో పూర్తయ్యేలా చూసే బాధ్యత కూడా మీదేనని మంత్రి స్పష్టం చేశారు. ప్రాజెక్టు పనులలో ఆలస్యం చేసే కాంట్రాక్టుర్లు నిర్లక్ష్యంగా వ్యవహారిస్తే వారిపై చర్యలు తీసుకోవాలని తెలిపారు. అధికారుల నిర్లక్ష్యంతో రైతులు నష్టపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్రంలోని నీటి పారుదల ఉన్నతాధికారులతో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎర్రమంజిల్ లోని జల సౌధలో సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయిలో పనుల లక్ష్యాలకు అనుగుణంగా పనులు చేయాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పనులు సకాలంలో పూర్తి కావాల్సిందేనన్నారు. పనులు మంచిగా పూర్తి చేసి వారిని తప్పకుండా గుర్తిస్తామని హామీ ఇచ్చారు. పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహారిస్తే చర్యలు తప్పవన్నారు. పనుల్లో కమిట్మెంట్ సిన్సీయారిటీ తప్పకుండా ఉండాలన్నారు. సమీక్ష అనంతరం ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleswaram project) పై కేటీఆర్ (KTR) వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం అన్నారు. ఆయన జోసెఫ్ గ్లోబెల్ గా పేరు మార్చుకుంటే బెటర్ అని ఎద్దేవా చేశారు. బీఆర్ ఎస్ (BRS) హయాంలో ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారని అన్నారు. మేడిగడ్డ (Medigadda) ను ముంచేశారని, పిల్లర్ల నుంచే మళ్లి కట్టాల్సి ఉందని తెలిపారు.
———————-