* హైదరాబాద్ నుంచి చెన్నయ్, బెంగళూరుకు బస్సులు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఇండిగో విమానంలో టికెట్లు బుక్ చేసుకున్న వారిని జీఎంఆర్ యాజమాన్యం శంషాబాద్ నుంచి బస్సుల్లో గమ్యస్థానాలకు చేర్చుతోంది. విమానాల ఆకస్మిక రద్దుతో చర్యలు చేపడుతోంది. శంషాబాద్ నుంచి చెన్నయ్, బెంగళూరు ప్రయాణికుల కోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. విశాఖపట్టణం, కాకినాడ, రాజమండ్రికి కూడా సాయంత్రం బస్సులు బయలుదేరతాయని ప్రకటించింది. ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా ఇండిగో-జీఎంఆర్ సంస్థలు ఏసీ స్లీపర్ బస్సులు ఏర్పాటు చేశాయి. అత్యవసరం ఉన్న వాళ్లు బస్సుల్లో వెళ్లాలని సూచిస్తున్నాయి. అలాగే విమానం రద్దు అయిన ప్రయాణికులకు ఆటోమేటిక్ గా పూర్తి చార్జీలు రిఫండ్ అవుతాయని ఇండిగో సంస్థ వెల్లడించింది. ఈనెల 5 నుంచి 15 వరకు ఉన్న ప్రయాణికులకు ఇది వర్తిస్తుందని తెలిపింది. ప్రయాణికుల అభ్యర్థుల మేరకు రీషెడ్యూల్ కూడా చేస్తామని చెప్పింది.
……………………………………….

