
* మాజీ మంత్రి హరీశ్‌రావు
ఆకేరున్యూస్, సంగారెడ్డి : ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని వ్యవసాయ కూలీలందరికి వర్తింపజేయాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో హరీశ్‌రావు విలేకరులతో మాట్లాడుతూ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద వ్యవసాయ కూలీలకు నెలకు వెయ్యి చొప్పున 12 వేలు ఇస్తామన్నారు. ఉపాధి హామీ పనిలో మట్టి పనులకు పోయే వారిని వ్యవసాయ కూలీలుగా గుర్తిస్తామన్నారని.. వారందరికీ పథకాన్ని వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. రేవంత్‌రెడ్డికి ఇష్టం లేకపోతే పథకం బంద్ చేసి.. తప్పయిందని క్షమాపణ చెప్పాలన్నారు.
………………………………..