Indiramma Houses
Indiramma Houses| ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్పూర్: ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో అవినీతి జరిగిందంటూ మాజీ ఎమ్మెల్యే రాజయ్య చేసిన ఆరోపణలు నిరాధారమని ఇప్పగూడెం గ్రామ సర్పంచ్ మందపురం రాణి–అనిల్ గౌడ్ అన్నారు. ఇకనైనా ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలం ఇప్పగూడెంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.
ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కోసం లబ్ధిదారుల నుంచి డబ్బులు తీసుకున్నట్లు రాజయ్య చేసిన ఆరోపణలను సర్పంచ్ తీవ్రంగా ఖండించారు. లబ్ధిదారుల వద్ద డబ్బులు తీసుకున్నట్లు నిరూపించాలని, ఆరోపణలపై చిత్తశుద్ధి ఉంటే గ్రామానికి వచ్చి లబ్ధిదారుల సమక్షంలో బహిరంగ చర్చకు సిద్ధం కావాలని సవాల్ చేశారు. ఆరోపణలు నిరూపిస్తే ప్రజా శిక్షకు సిద్ధమని, నిరూపించలేకపోతే రాజయ్య రాజకీయ సన్యాసం తీసుకుంటారా అని ప్రశ్నించారు.
94 ఇళ్లు మంజూరు
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాజయ్య ఇప్పగూడెం గ్రామానికి ఎన్ని ఇళ్లు మంజూరు చేశారో వెల్లడించాలని సర్పంచ్ కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రత్యేక చొరవతో ఇప్పగూడెం గ్రామానికి 94 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని తెలిపారు. అలాగే సుమారు రూ.2.30 కోట్లతో సీసీ రోడ్లు, ఇతర అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినట్లు పేర్కొన్నారు.
మరో నలుగురికి త్వరలో
ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి మరో నలుగురు అర్హులైన లబ్ధిదారులకు కొన్ని సాంకేతిక కారణాల వల్ల ప్రస్తుతం మంజూరు కాలేదని సర్పంచ్ తెలిపారు. ఈ విషయాన్ని ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, సాంకేతిక సమస్యలు పరిష్కారమైన వెంటనే వారికి కూడా ఇళ్లు మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్న ప్రభుత్వాన్ని, ఎమ్మెల్యే కడియం శ్రీహరిని విమర్శించేందుకు ఆధారాలు లేని ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. రాజయ్య ఆధారాలతో మాట్లాడాలని, నిరాధార ఆరోపణలు చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేదని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు జూలుకుంట్ల శిరీష రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు కత్తుల మల్లయ్య, వార్డు సభ్యులు కత్తుల రాజయ్య, కత్తుల రవి, దైద ఇలేషన్, బొంకూరి బిక్షపతి, గొడిశాల యాదగిరి, ఎస్. రాములు, పల్లె సత్యనారాయణ, కృష్ణమూర్తి, గట్టు మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
