
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : బీసీ రిజర్వేషన్ల అంశంపై తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు రానుందా? సుప్రీంకోర్టు లో లభించిన ఊరట ఇక్కడ కూడా కలగకుందా? అసలు ఏం జరగనుందే ఉత్కంఠ ఏర్పడింది. బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో విచారణ ప్రారంభమైన నేపథ్యంలో ఆసక్తిగా మారింది. ప్రభుత్వం తరఫున అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపిస్తున్నారు. రిజర్వేషన్ల అంశంపై సోమవారం తీర్పు వెలువరించిన సుప్రీం కోర్టు బీసీ రిజర్వేషన్లపై స్టే ఇవ్వడానికి నిరాకరించింది. హైకోర్టులో ఇప్పటికే పిటిషన్ ఉండగా ఇక్కడికి ఎందుకు వచ్చారని పిటిషనర్ ను ప్రశ్నించింది. హైకోర్టులోనే తేల్చుకోవాలని చెప్పింది. రిజర్వేషన్లపై గోపాల్ రెడ్డి వేసిన వ్యాజ్యాన్ని కొట్టేసింది. దీనిపై నేడు హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. ఈనేపథ్యంలోనే కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, కీలక నేతలు నిన్న సమావేశం అయ్యారు. ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు రావాలంటే ఏం చేయాలనే దానిపై సమాలోచనలు చేశారు.
………………………………………………..