ఆకేరున్యూస్, వరంగల్: డ్యాన్స్ చేస్తూ ఇంటర్ చదువుతున్న విద్యార్థిని కుప్పకూలింది. మహుబూబాద్ జిల్లా సీరోల్ మండల కేంద్రంలోని ఈఎం ఆర్ఎస్ పాఠశాలలో డ్యాన్స్ చేస్తున్న ఇంటర్ విద్యార్థిని రోజా కుప్పకూలింది. చికిత్స నిమిత్తం హాస్పటల్కి తరలించే లోపే విద్యార్ధిని మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మహుబూబాద్ జిల్లా, మరిపెడ మండలం,తానంచర్ల వాల్య తండా గ్రామపంచాయతీ పరిధిలోని సపావట్ తండాకు చెందిన విద్యార్థిని రోజా సిరోలు ఈ ఎం ఆర్ ఎస్ పాఠశాలలో సిఇసి మొదటి సంవత్సరం చదువుతుంది. నిన్న మంగళవారం రాత్రి ఈ ఎం ఆర్ ఎస్ సిరోలు పాఠశాలలో వీడ్కోలు పార్టీ సందర్భంగా రాత్రి 8 గంటలకు డ్యాన్స్ చేస్తూ చనిపోయింది. వారి స్వగ్రామానికి ఎల్ హెచ్ పి ఎస్ రాష్ట్ర అద్యక్షులు గుగులోతు భీమా నాయక్, కిసాన్ పరివార్ మరిపెడ మండల కోఆర్డినేటర్ ఎడెల్లి వెంకన్న, వెంకటేశ్వర్లు,సీరోల్ మండల కోఆర్డినేటర్ విష్ణు నాయక్,లంబాడీ స్టూడెంట్ ఆర్గనైజేషన్ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు గుగూలోతు శివవర్మ నాయక్,ఎల్ హెచ్ పి ఎస్ డోర్నకల్ నియోజకవర్గ ఇన్చార్జ్ రవి నాయక్,సోమోజి నాయక్ వెళ్లి పార్థివదేహాం వద్ద నివాళులర్పించారు.
…………………………………