
* రూ.25 లక్షల విలువైన బంగారం స్వాధీనం
ఆకేరు న్యూస్, నల్గొండ : నల్గొండ పోలీసులు అంతర్రాష్ట్ర చోరీ ముఠాను అరెస్ట్ చేశారు. ముఠా నుంచి రూ.25 లక్షల విలువైన 20 తులాల బంగారం ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. 1.800 కిలోల వెండి, బైకు, 2 ల్యాప్ టాప్ లు, 4 సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. నలుగురు సభ్యుల ముఠా తాళాలు వేసిన ఇళ్లనే టార్గెట్ చేసి చోరీలకు పాల్పడుతోంది. రంగారెడ్డి, మహబూబ్నగర్, వరంగల్(Warangal), నల్గొండ జిల్లాల్లో ఈ ముఠా వరుస చోరీలకు పాల్పడింది. ముఠా సభ్యులు మొత్తం 23 చోరీలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ముఠాలోని నలుగురు సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంకా ఎక్కడెక్కడ చోరీలకు పాల్పడ్డారో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టనున్నట్లు పోలీసులు వెల్లడించారు. మీడియా సమావేశంలో పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.
……………………………………………………………