* అనంతపురం డీఐజీపై వేటు
ఆకేరు న్యూస్, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ డీజీపీగా హరీశ్‌కుమార్ గుప్తాను ఎన్నికల కమిషన్ నియమించింది. సీనియార్టీ జాబితాలోని ఐపీఎస్ అధికారులు ద్వారకా తిరుమలరావు, మాదిరెడ్డి ప్రతాప్, హరీశ్ కుమార్ గుప్తా పేర్లను రాష్ట్ర ప్రభుత్వం ఈసీకి పంపగా, హరీశ్ గుప్తాను నియమించాలని ఈసీ ఆదేశించింది. తక్షణం బాధ్యతలు చేపట్టాలని హరీశ్ గుప్తాకు ఆదేశించింది. ప్రస్తుతం ఆయన హోంశాఖ ముఖ్యకార్యదర్శిగా ఉన్నారు. కాగా, అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు వేసింది. వెంటనే విధుల నుంచి రిలీవ్ కావాలని ఆదేశించింది. ఎలాంటి ఎన్నికల విధులు అప్పగించవద్దని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసింంది. ఈరోజు అనంతపురం జిల్లా కల్యాణదుర్గం పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడిన విషయం తెలిసిందే.
—————————–