Medaram Development Works Irrigation
* మేడారంలో పరిసరాలలో చేపట్టబోయే అభివృద్ధి పనులను పరిశీలించిన ఇరిగేషన్ చీప్ఇంజనీర్
ఆకేరు న్యూస్, ములుగు: మేడారం పరిసరాలలో రైతుల భక్తుల సౌకర్యార్థం ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టబోయే పనులను సంబంధిత శాఖ చీఫ్ ఇంజనీర్ ధర్మ సంబంధిత శాఖ ఇంజనీరింగ్ అధికారుల బృందంతో క్షేత్రస్థాయిలో ఆదివారం పరిశీలించారు. మొదట అధికారుల బృందం సమ్మక్క సారలమ్మ దేవతలను దర్శించుకుని ఆదివాసి ఆచార సంప్రదాయాల ప్రకారం మొక్కులు చెల్లించారు.
సమ్మక్క పూజారులు సిద్దబోయిన జనార్ధన్, భోజరావులు అమ్మవార్ల తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం మేడారం,ఊరట్టం గ్రామపంచాయతీ ల లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ల పరిధిలో జరిగే అభివృద్ధి పనుల క్షేత్ర స్థాయిలో పర్యటించి పరిశీలించారు. ఇందులో భాగంగా జంపగవాయి గ్రామం పరిధిలో 200 మీటర్లు, ఊరట్టం పరిధిలో 500 మీటర్ల స్నాన ఘట్టాలు, ఊరట్టం బ్రిడ్జ్ దగ్గర రివిట్మెంట్ వాల్, ఊరట్టం డబల్ బెడ్ రూమ్ సమీపంలో సైడ్ కరకట్ట,ఊరట్టం జీపీ పరిధిలో చెరువులు,మేడారం గ్రామపంచాయతి లో శివరాం సాగర్ చెరువు సుందరికరణ, కొంగల మడుగు చెరువు పునద్దరణ పనుల కోసం సర్వే చేశారు. ఈ కార్యక్రమం ఈఈ కొట్టెం నారాయణ, డి ఈఈ రవీందర్ రెడ్డి, ఏ ఈ రజియా, మేడారం సర్పంచ్ పీరీల భారతి వెంకన్న, సీతక్క యువసేన జిల్లా అధ్యక్షులు చెర్ప రవీందర్, యాలం రవి తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
