Station Ghanpur Journalists Day
Published:
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్ : జనగాం జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండల కేంద్రంలో టిఆర్ఎస్ నాయకులు ఆదివారం జర్నలిస్టుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి శాలువా లతో నియోజకవర్గ కేంద్రంలోని ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో బిఆర్ఎస్ కౌన్సిలర్లు పొన్న రాజేష్, బాలగాని అనిల్, బూర్ల రాజేశ్వర్ నాయకులు శీలం శ్యామ్, జబ్బార్, పృద్వి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
సమాజంలో నిరంతరం నిజాలను వెలికితీస్తూ ప్రజాహితం కోసం పాటుపడుతున్న జర్నలిస్టులను
సన్మానించి గౌరవించడం మా అదృష్టం అన్నారు.
ఈ వార్తకు సంబంధించిన బృందం

Reporter
U మల్లేశం, BA
30 సంవత్సరాలుగా జర్నలిజం వృత్తిలో కొనసాగుతున్నారు ..
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
