
* అన్ని రంగాల్లోనూ ఓబీసీలపై వివక్ష
* ఓబీసీల చరిత్ర రాయకపోవడం వెనుక ఆర్ఎస్ఎస్ కుట్ర
* ప్రాంతీయ భాషలు ముఖ్యమే.. ఇంగ్లీషూ ముఖ్యమే
* తెలంగాణలో పకడ్బందీగా కులగణన
* బీసీల న్యాయ సమ్మేళనంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ
ఆకేరు న్యూస్, న్యూ ఢిల్లీ : ప్రాంతీయ భాషలు ముఖ్యమే.. ఇంగ్లీషూ ముఖ్యమే అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. భాగీదారి న్యాయ మహా సమ్మేళన్ పేరుతో ఢిల్లీలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో బీసీల న్యాయ సమ్మేళనం జరిగింది. ఆయా కార్యక్రమాల్లోరాహుల్ మాట్లాడుతూ.. అవకాశాలను అందిపుచ్చుకునే సామర్థ్యం అందరికీ రావాలన్నారు. తమ శక్తిని తెలుసుకోలేకపోవడమే కొందరి సమస్య అని తెలిపారు. దేశంలో దళితుల చరిత్రను అంబేడ్కర్ అర్థం చేసుకున్నారని, సమస్యలను సరిగా అర్థం చేసుకుంటేనే పరిష్కారం సాధించగలరని సూచించారు. భారతదేశ ఉత్పాదక శక్తికి ఓబీసీలు ప్రతీకలన్నారు. ఓబీసీ చరిత్ర ఎక్కడుంది.. ఎవరు రాశారని ప్రశ్నించారు. ఓబీసీల చరిత్ర రాయకపోవడం వెనుక ఆర్ ఎస్ ఎస్ కుట్ర ఉందన్నారు. ఓబీసీలు అన్ని రంగాల్లోనూ వివక్ష ఎదుర్కొంటున్నారని తెలిపారు. కార్పొరేట్ ఇండియాలో ఓబీసీలు ఎక్కడున్నారని ప్రశ్నించారు. అదానీ ఓబీసీనా.? మీడియా రంగంలో ఓబీసీలకు స్థానం ఎక్కడుంది? తెలంగాణలో పకడ్బందీగా కులగణన చేపట్టారని అన్నారు. అభివృద్దిలో విద్యదే కీలక పాత్ర అని చెప్పారు. బీజేపీ నేతలు ఇంగ్లీషును వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు. ప్రాంతీయ భాషలు ముఖ్యమే.. ఇంగ్లీషూ ముఖ్యమే అన్నారు. ఇంగ్లీషును వ్యతిరేకించే వారంతా తమ పిల్లలను ఎక్కడ చదివిస్తున్నారని తెలిపారు.
…………………………………..