* భూములను ఇవ్వబోమంటే రైతులను జైల్లో పెడుతున్నారు
* అర్ధరాత్రి అరాచకాలు ఏందని ప్రశ్నిస్తే.. సమాధానం చెప్పలేక అసెంబ్లీని వాయిదా వేశారు
* అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద కేటీఆర్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణలో ఉన్నది ప్రజాస్వామ్య ప్రభుత్వమా.. అరాచక ప్రభుత్వమా.. అని బీఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్(KTR) ప్రశ్నించారు. అసెంబ్లీ(ASSEMBLY) నుంచి బయటకు వచ్చిన అనంతరం మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. లగచర్ల(LAGACHARLA) భూములను ఇవ్వబోమంటే రైతులను జైల్లో పెడుతున్నారని, ఇంటింటికీ వెళ్లి ఆడబిడ్డలను బెదిరిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే జైల్లో పెడుతున్నారని అన్నారు. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమా.. అరాచకమా ప్రభుత్వమా.. అని ప్రశ్నించారు. లగచర్లలో అర్ధరాత్రి అరాచకాలు ఏందని ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక ప్రభుత్వం అసెంబ్లీని వాయిదా వేసిందన్నారు. ప్రభుత్వం ఎన్నిరకాల క్షోభ పెట్టినా, బాధితులకు కేసీఆర్(KCR), తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రైతన్నకు బేడీలు వేసిన ప్రభుత్వాన్ని ఎండగడతామన్నారు. సీఎం రేవంత్ (CM REVANTH) వంద సార్లు ఢిల్లీకి వెళ్లారని, కనీసం 100 పైసలు కూడా నిధులు తేలేదని విమర్శించారు.
………………………………………….