Published:
Updated: 29 Oct 2024 • 06:36 AM
ఆకేరున్యూస్, హైదరాబాద్: భువనగిరి సబ్ జైలు రిమాండ్ ఖైదీ భువనగిరి ప్రభుత్వ హాస్పిటల్ నుంచి పరారయ్యాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. ఈనెల 17న భువనగిరి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫోక్సో కేసులో అరెస్ట్ అయిన వ్యక్తిని జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా భువనగిరి సబ్ జైలుకు తరలించారు. 22న మెడికల్ చెక్ అప్ నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్కు తీసుకువెళ్లిన సమయంలో పోలీసుల కళ్లు కప్పి పరారయ్యాడు. పరారైన ఖైదీ విషయం బయటకి రాకుండా జైలు సిబ్బంది జాగ్రత్తపడ్డట్లు సమాచారం. అనంతరం ఖైదీని పట్టుకొని సబ్ జైలుకు తరలించారు.
……………………………………..
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
