* రైతులను దగా చేసిన పార్టీ బీజేపీ
* తెలంగాణలో 2 లక్షల కోట్లు రైతులు నష్టపోయేలా చేసిన పార్టీ బీజేపీ
* ప్రభుత్వానికి సహకరించాల్సింది పోయి అసందర్భ దీక్షలా?
* మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఫైర్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయాలని బీజేపీ దీక్ష చేయడంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(MINISTER TUMMALA NAGESWARARAO) ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల గురించి ఆ పార్టీ దీక్ష చేయడం వింతగా ఉందన్నారు. దేశ రైతాంగాన్ని, వారి ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని దగా చేసిన బీజేపీ.. మద్దతు ధర పెంచుతామని, స్వామినాథన్ కమిషన్ కు అనుగుణంగా మేలు చేస్తామని రైతులను మభ్య పెట్టిన బీజేపీ..(BJP) ఒక్క తెలంగాణ రాష్ట్రంలో రైతులకు రెండు లక్షల కోట్లు నష్టపరిచిన బీజేపీ.. కాంగ్రెస్ ప్రభుత్వం(CONGRESS GOVERNMENT)పై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. భారతదేశంలో రుణమాఫీ(RUNA MAAFI) అనే మాట ఎక్కడా పలకని బీజేపీ.. ఇప్పుడు అసందర్భ దీక్ష చేసిందన్నారు. మొదటి పంట కాలంలోనే 31 వేల కోట్లు రుణమాఫీ చేస్తామని, మాట ఇచ్చి ఇప్పటికే మూడు విడతలుగా 18వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేసిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వమని తుమ్మల తెలిపారు. ఇటువంటి ప్రభుత్వానికి సహకరించాల్సింది పోయి.. కేంద్ర నుంచి రావాల్సిన బకాయిలను ఇప్పించాల్సింది పోయి.. మధ్యలో రుణమాఫీ కాలేదని చెప్పి అసందర్భ దీక్షలు చేస్తున్నారన్నారు.
వాస్తవంగా తాము మాట ఇచ్చింది నవంబర్ 22 వరంగల్లో రైతు డిక్లరేషన్ రోజున అని, అయినా సరే.. గత ప్రభుత్వం సరిగా చేయలేదని ఐదేళ్లలో రైతుల బాకీలను మాఫీ చేయాలని సీఎం రేవంత్(CM REVANTH) పెద్ద మనసుతో నిర్ణయించారని చెప్పారు. రైతుల అప్పు ఉన్న ప్రతీ ఖాతాను తమకు పంపాలని బ్యాంకర్లను కోరామని, వారి ఖాతాలో రూ. 2 లక్షలు వేస్తామని చెప్పామని వివరించారు. 42 లక్షల ఖాతాలను వారు తమకిచ్చారని, ఒకే నెలలో 22 లక్షల మందికి 18 వేల కోట్లు ఖాతాల్లో వేశామని తుమ్మల వివరించారు. బ్యాంకర్లు(BANKERS) ఇచ్చిన ఖాతాలు కాకుండా, ఇంకా ఏమైనా ఉంటే బీజేపీ నేతలు సమర్పించినా, అందరికీ రుణమాఫీ చేస్తామన్నారు.
……………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
