* కానీ ఉరితాడు వేసుకున్నాడు
ఆకేరు న్యూస్, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మరో మూడు రోజుల్లో మూడు ముళ్లు వేయాల్సిన వాడు ఉరితాడు వేసుకున్నాడు. విషాదకర ఈ ఘటన నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం మంగళ్ పహాడ్ లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మంగళ్ పహాడ్ గ్రామానికి చెందిన ప్రతాప్ గౌడ్ ఇటీవలే పెళ్లి నిశ్చయమైంది. ఈ నెల 16 న పెళ్లి ముహూర్తం. ఇంకా మూడు రోజులు అయితే ఓ ఇంటివాడు అయ్యే వాడు కానీ ఇంతలోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పెళ్లికి ముందుగా చేసే పోచమ్మ పండగను మంగళవారం చేయాలని నిశ్చయించారు. పోచమ్మ పండుగకు వచ్చిన బంధువులు ఏదో అన్నారని మనస్తాపానికి గురైన ప్రతాప్ ఊరి చివర గుట్టపై చెట్టుకు ఉరివేసుకొని కన్పించాడు.కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
………………………………………………………..
