
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : మాజీ మంత్రి మల్లారెడ్డి ( c,h, malla reddy ) కుమారుడు భద్రారెడ్డి ఇంట్లో గురువారం ఐటీ అధికారులు దాడులు చేశారు.కొంపల్లి లోని భద్రారెడ్డి ఇంటితో పాటు మల్లారెడ్డి హాస్పిటల్స్, సూరారంలోని మల్లారెడ్డి మెడికల్ కాలేజీలో ఆర్థిక లావాదేవీలను కొన్ని రోజుల క్రితం ఐటీ అధికారులు పరిశీలించారు. మళ్లీ ఇవాళ ఐటీ అధికారులు సోదాలు చేశారు. అనుమానాస్పందంగా భారీ స్థాయిలో నగదు లావాదేవీల జరిగాయని ఐటీ అధికారులకి సమాచారం అందిన నేపథ్యంలో మల్లారెడ్డి హాస్పిటల్ చైర్మన్ భద్రారెడ్డి నివాసంలో సోదాలు నిర్వహించారు. ఇటీవల నిర్వహించిన ఆన్ లైన్ లావాదేవీల గురించి ఐటీ అధికారులు మల్లారెడ్డి కుటుంబసభ్యులను ప్రశ్నించారు. అలాగే మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్లలో పనిచేసే సిబ్బంది సెల్ ఫోన్లను కూడా ఐటి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బోనాల ఉత్సవాల సందర్భంగా మల్లారెడ్డి కోడలు ప్రతీ బీజేపీ నాయకులను కలిశారు. ఈ నేపధ్యంలో మల్లారెడ్డి కుమారిడి ఇంట్లో ఐటీ దాడులు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది.అయితే ఐటీ అదికారులు దాడులు చేశారన్న విషయాన్ని మల్లారెడ్డి కోడలు ప్రీతి ఖండించారు. సోషల మీడియాల్లో వస్తున్న వార్తల్లో నిజల లేదని తెలిపారు.
……………………………………….