* 200కు చేరువవుతున్న మరణాల సంఖ్య
* ఊహకందని విషాదంతో కేరళ కకావికలం
* ఐఎండీ మరో పిడుగులాంటి వార్త
* మళ్లీ అతిభారీ వర్షాలంటూ ప్రకటన
ఆకేరు న్యూస్ డెస్క్ : మొత్తం ప్రపంచాన్నే దిగ్ర్భాంతికి గురిచేస్తోంది వయనాడ్ (Wayanad) లోని మృత్యుఘోష. అంతకంతకూ ఆ ఘోష ఆవహిస్తూనే ఉంటోంది. మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటికే 180 మంది వరకూ మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇంకా శకలాల తొలగింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈనేపథ్యంలో మృతుల సంఖ్య 200కు చేరవవుతుందనే ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. కేరళ (Kerala) వయనాడ్ జిల్లా (Wayanad District) లోని మెప్పడి (Meppadi), చూరల్మల గ్రామాల (Churalmala villages) తో పాటు ముండక్కై పట్టణం (Mundakkai town) పై విరిగిపడ్డ కొండచరియల (Landslides) కింద ఇంకా చాలామంది ఇరుక్కునే ఉంటారని తెలుస్తోంది. ఇదిలాఉండగా.. ఇక్కడి తోటల్లో పని చేసేందుకు అస్సాం (Assam), పశ్చిమ బెంగాల్ (West Bengal) నుంచి వచ్చిన దాదాపు 600 మంది ఆచూకీ లియడం లేదు. ప్రాణనష్టం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ప్రకృతి అందాలకు చిరునామాగా ఉండే ఈ ప్రాంతమంతా ఇప్పుడు విపత్తు సృష్టించిన విలయంతో హృదయవిదారకంగా మారింది. మరోవైపు వయనాడ్ (Wayanad) లో కొండచరియలు విరిగిపడిన ప్రాంతాన్ని కేంద్ర మంత్రి జార్జి కురియన్ (Union Minister Georgi Kurian) సందర్శించారు. ఆ ప్రాంతంలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ జరుగుతున్న సహాయక చర్యలు, ఇతర పరిస్థితులపై వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను, మృతుల కుటుంబాలను పరామర్శించారు.
భారీ నుంచి అతి భారీ వర్ష సూచన..
విపత్తు వేళ భారత వాతావరణ శాఖ (Meteorological Department) కేరళ వాసులకు మరో పిడుగులాంటి వార్త చెప్పింది. ఆగస్టు 3వ తేదీ వరకూ రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ (IMD)తెలిపింది. ఈ మేరకు పలు జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది. ప్రకృతి ప్రకోపానికి తీవ్రంగా ప్రభావితమైన వయనాడ్ జిల్లాతోపాటు మలప్పురం (Malappuram), కోజికోడ్ (Kozhikode), కన్నూర్ (Kannur), కాసరగోడ్ (Kasaragod) లకు ఐఎండీ ‘ఆరెంజ్’ అలర్ట్(‘Orange’ alert)జారీ చేసింది. ఇడుక్కి (Idukki), త్రిసూర్ (Thrissur), ఎర్నాకులం (Ernakulam), పాలక్కాడ్ జిల్లా(Palakkad districts) లకు ‘ఎల్లో’ అలర్ట్ (‘Yellow’ alert) ప్రకటించింది. అదేవిధంగా తిరువనంతపురం, కొల్లాం జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
-----------------