* కసరత్తు దాదాపు పూర్తి
* ప్రకటనే తరువాయి అని ప్రచారం
ఆకేరు న్యూస్, స్పోర్ట్స్ట్ డెస్క్ : తన కెప్టెన్సీ (Captaincy)లో టీ20 ప్రపంచ కప్ ను గెలిచిన రోహిత్ శర్మ (Rohit Sharma).. అనంతరం టీ20 క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. తాను ఇప్పటి నుంచి వన్డే, టెస్టు క్రికెట్ (Test cricket) లో మాత్రమే ఆడతానని చెప్పాడు. దీంతో టీ20 క్రికెట్టీమ్ కు సారథి కోసం బీసీసీఐ(BCCI) తీవ్ర కసరత్తు చేస్తోంది. రేసులో ప్రధానంగా ముగ్గురు ప్లేయర్ల పేర్లు వినిపించాయి. టీ20 ప్రపంచకప్లో భారత జట్టుకు వైస్ కెప్టెన్గా వ్యవహరించిన హార్దిక్ పాండ్యా (Hardik Pandya), కొంత గ్యాప్ తర్వాత తిరిగి క్రికెట్ గ్రౌండ్ లోకి అడుగుపెట్టిన వికెట్ కీపర్ (Wicket keeper) ఐపీఎల్ (IPL) ద్వారా అద్భుతమైన ఆరంభం సాగించిన రిషబ్ పంత్ (Rishabh Pant), ప్రపంచ గొప్ప బౌలర్లలో ఒకరుగా పేరొందిన జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) పేర్లు రేసులో ఉన్నాయి. కాగా, రోహిత్ శర్మ (Rohit Sharma)వారసుడిగా హార్దిక్ పాండ్యా (Hardik Pandya) ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అదే జరిగితే శ్రీలంకతో జరిగే సిరీస్లో భారత్ టీ20 జట్టుకు పాండ్యా కెప్టెన్గా ఉండనున్నాడు. పీటీఐ ప్రకారం, సెలక్షన్ కమిటీ (Selection Committee) ఇప్పుడు హార్దిక్ పాండ్యాను (Hardik Pandya) భారత టీ20 జట్టుకు కెప్టెన్ (Captain of Indian T20 team) గా చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అధికారిక ప్రకటనే తరువాయి అని తెలుస్తోంది.
——————————–