
జస్టిస్ ఎల్. నర్సింహారెడ్డి
* జస్టిస్ ఎల్. నర్సింహారెడ్డి
* న్యాయ వ్యవస్థపై గౌరవంతో చైర్మన్ పదవి నుంచి తప్పుకుంటున్నానని వెల్లడి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : గత ప్రభుత్వంలో విద్యుత్ ఒప్పందంలో జరిగిన అవకతవకలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విద్యుత్ కమిషన్ (Electricity Commission) తీరుపై కేసీఆర్ (KCR) వేసిన పిటిషన్‌పై ఈరోజు సుప్రీంకోర్టులో వాదనలు జరిగిన విషయం తెలిసిందే. వాదోపవాదాలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం.. చైర్మన్ ను మార్చాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈమేరకు ప్రభుత్వం సోమవారం వరకు గడువు కోరింది. కాగా, కేసీఆర్ ఆరోపణలు, కోర్టు తీర్పుపై జస్టిస్ ఎల్. నర్సింహారెడ్డి (L. Narasimha Reddy) స్పందించారు. కమిషన్ చైర్మన్ గా విచారణను పారదర్శకంగా నిర్వహించానని తెలిపారు. విచారణ ప్రాసెసింగ్‌ను మాత్రమే మీడియాకు వివరించినట్లు తెలిపారు. ఊహాజనిత వార్తలకు చెక్ పెట్టేందుకు మీడియా ముందుకు వచ్చినట్లు తెలిపారు. న్యాయ వ్యవస్థపై గౌరవంతోనే చైర్మన్ పదవి నుంచి తప్పుకుంటున్నట్టు వివరించారు.
——————————————–