
సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో మరో ఇద్దరు నిందితులను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.
* ఉత్తర మండల డీసీపీ కార్యాలయానికి తరలింపు
* సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో …
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో మరో ఇద్దరు నిందితులను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఏ3గా ఉన్న విశాఖ సృష్టి కేంద్రం మేనేజర్ కళ్యాణిని, ఏ6గా ఉన్న అస్సాంకు చెందిన ధనశ్రీ సంతోషిను కస్టడీలోకి తీసుకుని ఉత్తర మండల డీసీపీ కార్యాలయానికి తరలించారు. ఐదు రోజుల కస్టడీకి ఇటీవల సికింద్రాబాద్ సివిల్ కోర్టు అనుమతించింది. వీరిని సరోగసీ వ్యవహారంలో మరింత లోతుగా పోలీసులు విచారించనున్నారు. ఈ ఇద్దరికి సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లో సరోగసీ పేరుతో కొంతమంది దంపతులను మోసం చేసి డబ్బులు దండుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఏజెంట్ల సాయంతో అస్సాంకు చెందిన మహిళ నుంచి పిల్లలను కొనుగోలు చేసి తీసుకొచ్చి దంపతులకు వారి బిడ్డగా అప్పగించారు. మరోవైపు నిబంధనలకు విరుద్ధంగా వీర్యం, అండాలు సేకరించి ఇతర రాష్ట్రాలకు విక్రయించారనే ఆరోపణలు ఉన్నాయి.
—————