* తన సోదరుడు వైఎస్ జగన్పై మరోసారి రెచ్చిపోయిన వైఎస్ షర్మిల
ఆకేరున్యూస్, అమరావతి: ఏపీ మాజీ సీఎం, తన సోదరుడు వైఎస్ జగన్పై మరోసారి కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెచ్చిపోయారు. వైఎస్ఆర్ తన జీవితం మొత్తం మత పిచ్చి బీజేపీని వ్యతిరేకిస్తే.. అదే బీజేపీకి జగన్ దత్తపుత్రుడు అయ్యారని విమర్శించారు. బీజేపీతో చెట్టాపట్టాలు వేసుకుని తిరిగిన మోదీ వారసుడు అని మండిపడ్డారు. అలాంటి వాళ్లకు వైఎస్ఆర్ ఆశయాలు గుర్తుకు ఉంటాయని అనుకోవడం పొరపాటే అని అన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ మహానేత హయాంలో, కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన ఒక ప్రతిష్ఠాత్మక పథకమని తెలిపారు. పేద బిడ్డల జీవితాల్లో వెలుగులు నింపి, ఎంతో మంది ఇంజనీర్లను, డాక్టర్లను తయారు చేసిన గొప్ప పథకమని కొనియాడారు. ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో బకాయిలు ఎవరు పెట్టినా అవి విడుదల చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని ఏపీ సీఎం చంద్రబాబుకు తెలిపారు. పెండిరగ్ నిధులను వెంటనే విడుదల చేసి, పథకానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా చూడాలని డిమాండ్ చేశారు.
……………………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
