ఆకేరు న్యూస్, స్పోర్ట్స్ డెస్క్ : ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కొత్త ఛైర్మన్‌గా జై షా(jai sha)బాధ్యతలు స్వీకరించారు. భారత్(Bharath) నుంచి ఐసీసీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన మరో వ్యక్తిగా షా గుర్తింపు పొందారు. జై షా అభ్యర్థిత్వానికి ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డుల మద్దతు కూడా ఉంది. ఐసీసీ(icc) చరిత్రలోనే అతిపిన్న వయస్కుడైన ఛైర్మన్‌గా 35 ఏళ్ల జై షా రికార్డుల్లోకి ఎక్కారు. ప్రస్తుత ఐసీసీ ఛైర్మన్ అయిన బార్క్లే 2020 నవంబర్‌లో ఇండిపెండెంట్ ఐసీసీ ఛైర్‌గా నియమితులయ్యారు. 2022లో ఆయన మరోసారి ఈ పదవికి ఎన్నికయ్యారు. మూడోసారి ఈ పదవి కోసం పోటీ చేసే ఉద్దేశం తనకు లేదని బార్క్లే(barkle) స్పష్టం చేశారు. నేటి నుంచి కొత్త ఛైర్మన్ పదవీ కాలం ప్రారంభమైంది.
…………………………………..