
* లోక్సభలో మూజువాణి ఓటుతో ఆమోదం
ఆకేరున్యూస్, ఢిల్లీ: ఒకే దేశం-ఒకే ఎన్నికపై ఏర్పాటైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ పదవీకాలాన్ని 2025 వర్షాకాల సమావేశాల చివరి వారం మొదటి రోజు వరకు పొడిగించే ప్రతిపాదనను లోక్సభ మంగళవారం ఆమోదించింది. ’ఒకే దేశం-ఒకే ఎన్నిక’ బిల్లు 2024 , కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల (సవరణ) బిల్లు 2024పై లోక్సభలో నివేదిక సమర్పించడానికి సమయాన్ని పొడిగించాలని జాయింట్ పార్లమెంటరీ కమిటీ చైర్మన్ పిపి చౌదరి మంగళవారం ప్రతిపాదించారు. దీనిని సభ మూజువాణి ఓటు ద్వారా ఆమోదించింది. దేశవ్యాప్తంగా ఒకేసారి లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించేందుకు తీసుకువచ్చిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్రం లోక్సభలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అధ్యక్షతన వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై మోడీ ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా బీజేపీ ఎంపీ, మాజీ న్యాయశాఖ మంత్రి పిపి చౌదరి అధ్యక్షతన 39 మంది సభ్యుల జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు- చేశారు. ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వల్ల ఖర్చుచ, సమయం ఆదా అవుతాయని ప్రభుత్వం చెబుతోంది. అయితే ప్రతిపక్షాలు మాత్రం అంగీకరించడం లేదు. తాజాగా జెపిసి చైర్మన్, భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఎంపి పిపి చౌదరి గడువు హెచ్చింపు కోసం తీర్మానాన్ని లోక్సభలో ప్రతిపాదించారు. సభ మూజువాణి వోటుతో తీర్మానానికి ఆమోదం తెలిపింది. రాజ్యసభ నుంచి ఒక కొత్త సభ్యుని కమిటీ-లో చేరుస్తున్నట్లు- లోక్సభ సెక్రటరీ జనరల్ సభకు తెలియజేశారు. రాజ్యసభ నుంచి వైసిపి ఎంపి వి విజయసాయి రెడ్డి రాజీనామాతో 39 మంది సభ్యుల కమిటీలో ఒక ఖాళీ ఏర్పడిరది.జమిలి ఎన్నికలపై జెపిసిని గత శీతాకాల సమావేశాల్లో ఏర్పాటు- చేశారు. కమిటీ- కాలపరిమతి ప్రస్తుత సమావేశాల చివరి వారం మొదటి రోజున ముగియవలసి ఉన్నది. కాగా, రానున్న వర్షాకాల సమావేశాల చివరి వారంలో తొలి రోజు వరకు కమిటీ గడువును సభ పొడిగించింది. 39 మంది ఎంపిలతో ఏర్పాటుచేసిన జెపిసి ఈ బిల్లును అధ్యయనం చేస్తోంది. కమిటీలో లోక్సభ నుంచి 27 మంది, రాజ్యసభ నుంచి 12 మంది సభ్యులు ఉన్నారు. వాస్తవానికి కమిటీ- కాలపరిమితి ఏప్రిల్ 4న ముగియనున్నది. బిల్లుపై చేయవలసిన పని ఇంకా మిగిలి ఉందని అధికార వర్గాలు వెల్లడిరచిన నేపథ్యంలో జెపిసి గడువు పొడిగించే తీర్మానానికి లోక్సభ మంగళవారం ఆమోదం తెలియజేసింది.
……………………………………