* కేటీఆర్‌ను హెచ్చరించిన రాజాసింగ్
ఆకేరున్యూస్, హైదరాబాద్: ఏ పార్టీ అధికారంలో ఉంటే వారు చెప్పిన విధంగానే పోలీసులు వింటారని, పోలీసు శాఖతో పెట్టుకోవద్దని మాజీ మంత్రి కేటీఆర్‌ను ఎమ్మెల్యే రాజాసింగ్ హెచ్చరించారు. గత ప్రభుత్వ హయాంలో అప్పటి మంత్రి కేటీఆర్ ఆదేశంతో ఏకంగా రేవంత్ రెడ్డి బెడ్రూమ్లోకి చొచ్చుకెళ్లి మరీ పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి జైలుకు పంపారని అన్నారు. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత కూడా.. ఆ సమయంలో తనను అరెస్ట్ చేసిన వారిని ఏమీ చేయలేదని తెలిపారు. కానీ ‘మేము అధికారంలోకి వచ్చాక రిటైరైన పోలీసుల మీద కూడా చర్యలు తీసుకుంటామని ఇప్పుడు కేటీఆర్ అంటున్నారని.. ఎవరు అధికారంలో ఉంటే వాళ్లు చెప్పిన విధంగా పోలీసులు లీగల్‌గానే పనిచేస్తారని… ఆ విషయం మర్చిపోయారా కేటీఆర్ అని ప్రశ్నించారు. తనపై పీడీ యాక్ట్ పెట్టి జైలుకు కూడా పంపించారని రాజా సింగ్ గుర్తుచేశారు. అయితే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చాక.. తనను అరెస్ట్ చేసిన పోలీసు అధికారులను, బీజేపీ అధికారులను ఏం చేయాలని ప్రశ్నించారు.
……………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
