* ఆమోదం తెలిపిన కేబినెట్
* ఈ సమావేశాల్లోనే సభ ముందుకు బిల్లు
ఆకేరున్యూస్, న్యూఢిల్లీ : జమిలి ఎన్నికలకు సంబంధించి కీలక ముందడుగు పడిరది. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా రూపొందించిన ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ బిల్లుకు ఆమోదం లభించింది. పార్లమెంట్ పంచాయితీ ఎన్నికలు అన్నీ ఒకేసారి నిర్వహించేందుకు సమాయత్తం చేస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. ఈ బిల్లుపై చర్చించేందుకు అన్ని రాష్ట్రాల అసెంబ్లీల స్పీకర్లనూ ఆహ్వానించనున్నట్టు సమాచారం. కాగా, జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై కేంద్ర ప్రభుత్వం నియమించిన రామ్నాథ్ కోవింద్ కమిటీ ఇప్పటికే నివేదిక సమర్పించిన సంగతి తెలిసిందే..
……………………………..