– నియోజకవర్గంలో విద్య,వైద్య,నైపుణ్యంపై ప్రత్యేక దృష్టి సారించాం
– త్వరలో కమలాపూర్ బస్టాండ్ నిర్మాణంకై నిధులు మంజూరు
– రాబోయే రోజుల్లో ఇంటిగ్రేటెడ్ పాఠశాలను తీసుకొస్తాం
– సోషల్ మీడియాలో పోస్టులకే ప్రస్తుత ఎంపీ, ఎమ్మెల్యే
– గెలిచినా, ఓడిన ప్రజలతో ఉన్నా…ఉంటా.
– హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వొడితల ప్రణవ్
ఆకేరు న్యూస్, కమలాపూర్ : వివిధ గ్రామాలకు చెందిన కుల సంఘాలు,పార్టీల నాయకులు, యూత్ సభ్యులు భారీ సంఖ్యలో మంగళవారం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ సమక్షంలో పార్టీలో చేరారు.వారికి కండువా కప్పి ప్రణవ్ పార్టీలోకి ఆహ్వానించారు.అనంతరం జరిగిన సమావేశంలో వొడితల ప్రణవ్ మాట్లాడుతూ… హుజురాబాద్ నియోజకవర్గంలో విద్య, వైద్యం నైపుణ్యాలపై ప్రత్యేక దృష్టితో పనిచేస్తూ ఏటీసీ కాలేజీనీ మంజూరు చేపించామని, రాబోయే రోజుల్లో ఇంటిగ్రేటెడ్ పాఠశాల మంజూరు కోసం సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లానని అన్నారు. కమలాపూర్ బస్టాండ్ నిర్మాణం పూర్తి గూర్చి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు, ప్రభుత్వ హాస్పిటల్ గూర్చి దామోదర రాజనర్సింహకు నివేదికలు ఇచ్చామని త్వరలోనే నిధులు మంజూరు చేయనున్నట్టు ప్రణవ్ అన్నారు.హుజూరాబాద్ లో గతంలో ఎన్నడూ ఎవరూ చేయని విధంగా మూడు మార్కెట్లకు చైర్మెన్ లను, ఆలయాలకు చైర్మెన్ లను నియమించామని అన్నారు.సోషల్ మీడియాలో పోస్టులు తప్ప ప్రస్తుత ఎంపీ, ఎమ్మెల్యే నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదని ఆయన అన్నారు.తాను చెప్పినట్టుగా గెలిచినా, ఓడిన ప్రజల మధ్యనే ఉన్నానని,ఉంటానని అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మండలంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయబోతున్నామని ,కార్యకర్తలు సిద్ధం కావాలని సూచించారు.కార్యక్రమంలో కమలాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
……………………………………….
