Dragon Movie Special Song Jr NTR
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘డ్రాగన్’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘కేజీఎఫ్’, ‘సలార్’ చిత్రాలతో తనదైన మేకింగ్, యాక్షన్ శైలిని చూపించిన ప్రశాంత్ నీల్.. ఈసారి తారక్‌ను మరింత పవర్ఫుల్ మాస్ అవతార్‌లో చూపించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో కొనసాగుతున్నట్లు సమాచారం. సినిమా కోసం భారీ సెట్స్‌ను నిర్మించి కీలక ఎపిసోడ్స్‌ను తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది.
* స్పెషల్ సాంగ్.. భారీ సెట్
‘డ్రాగన్’లో ఓ ప్రత్యేక గీతం ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ పాటను కూడా మామూలుగా కాకుండా భారీ స్థాయిలో చిత్రీకరించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. ఇందుకోసం ప్రత్యేకంగా భారీ సెట్‌ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.పాటలో ఎన్టీఆర్ లుక్, డ్యాన్స్‌తో పాటు గ్రాండ్ విజువల్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ స్పెషల్ సాంగ్‌లో కథానాయిక రుక్మిణీ వసంత్‌తో పాటు మరో ఇద్దరు హీరోయిన్లు కూడా ఎన్టీఆర్‌తో కలిసి స్టెప్పులు వేయనున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. భారీ సెటప్, పలువురు డ్యాన్సర్లు, గ్రాండ్ కొరియోగ్రఫీతో ఈ పాటను ప్రేక్షకులకు విజువల్ ట్రీట్‌గా అందించేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. సినిమాలో ఈ సాంగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచే అవకాశం ఉందని టాక్.
* తారక్ లుక్‌పై భారీ అంచనాలు
‘డ్రాగన్’లో ఎన్టీఆర్ పాత్ర, లుక్ విషయంలో దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్‌తో తారక్ కొత్త లుక్కు మంచి స్పందన వచ్చింది. పాత్రకు తగ్గట్టుగా ఎన్టీఆర్ తన శరీరాకృతిలోనూ మార్పులు చేసినట్లు సమాచారం.ప్రశాంత్ నీల్ మార్క్ మాస్ ఎలివేషన్స్‌కు ఎన్టీఆర్ ఇమేజ్ తోడవడంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందనే ఆసక్తి అభిమానుల్లో మరింత పెరిగింది. ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్‌తో పాటు స్పెషల్ సాంగ్ కూడా సినిమాకు మరో హైలైట్‌గా నిలుస్తుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
* భారీ తారాగణం
ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ కథానాయికగా నటిస్తున్నారు. అనిల్ కపూర్, బిజూ మీనన్, ఖుష్బూ సుందర్, గురు సోమసుందరం తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నట్లు సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ‘డ్రాగన్’పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో.. భారీ యాక్షన్ సన్నివేశాలతో పాటు స్పెషల్ సాంగ్ ఎలా ఉండబోతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
