
ఆకేరున్యూస్, హైదరాబాద్: పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలనే వ్యాజ్యాలపై సింగిల్జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ అసెంబ్లీ కార్యదర్శి వీ నర్సింహాచార్యులు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు నేడు తీర్పు వెలువరించనుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్లను అనుమతిస్తూ సింగిల్జడ్జి సెప్టెంబర్ 9న ఇచ్చిన తీర్పును కొట్టేయాలని దాఖలైన రెండు పిటిషన్లపై హైకోర్టు డివిజన్ బెంచ్ ఈ నెల 12న వాదనలు ముగించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాసరావుతో కూడిన ద్విసభ్య ధర్మాసనం నేడు తీర్పు వెలువరించనుంది.
…………………………………………..