
* గాసిప్స్‌కి చెక్ పెట్టిన జాహ్నవి కపూర్
ఆకేరు సినియా డెస్క్ : జాహ్నవి కపూర్ .. బాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్.. ఈ ముద్దుగుమ్మపై ఇండస్ట్రీలో అంచనాలు కూడా ఎక్కువే… భారతీయ సినియా రంగాన్ని ఓ ఊపు ఊపిన అతిలోకసుందరి శ్రీదేవి,బోనికపూర్ ల ముద్దుల కూతురు.. శ్రీదేవి కూతురు కావడంతో అందరి దృష్టి జాహ్నవి పైనే ఉంది.. అందుకు తగ్గట్టుగానే తన డెబ్యూ సినిమా దడక్ తోనే తానేంటో నిరూపించుకుంది. జూనియర్ ఎన్టీఆర్ తో దేవరా సినిమాలో తెలుగుప్రేక్షకుల మనసునూ దోచుకుంది.జాహ్నవి చూసిన వారు తల్లి తగ్గ కూతురు అంటూ కితాబు ఇస్తున్నారు.మిలి సినిమాలో జాహ్నవి నటనకు గాను ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డును అందుకుంది.. అయితా ఈ అందాల భామ ప్రేమలో పడిందని బాలీవుడ్ లో అప్పుడు గాసిప్స్ మొదలయ్యాయి, శిఖర్ పహారియాతో జాన్వీ రిలేషన్లో ఉన్నట్లుగా గతకొంతకాలంగా వార్తలు వస్తున్నాయి.శిఖర్ పహారియా మహారాష్ట్ర మాజీ సీఎం సుషీల్ కుమార్ షిండే మనవడు.. వ్యాపారవేత్తగా రాణిస్తున్న శిఖర్ క్రీడలపై ఆసక్తి ఉంది. శిఖర్ అంతర్జాతీయ పోలో టోర్నమెంట్ లో భారత్ కు ప్రాతినిధ్యం వహించాడు. ఈ మధ్య కాలంలో శిఖర్,జాహ్నవి ప్రేమలో పడ్డారని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాకరనే వార్తలు వస్తున్న నేపధ్యంలో జాహ్నవి తన పెళ్లి పై వస్తున్న వదంతులకు చెక్ పెట్టింది.. తనకు కెరీర్ ముఖ్యమని ఇప్పుడిప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం లేదని తెగేసి చెప్పింది.. ఇంతకూ శిఖర్ తో ప్రేమ వ్యవహారం గురించి మాత్రం ఏ కామెంట్ చేయలేదు..
………………………………………………….