
* ఖురాన్ స్ఫూర్తిని మరిచిపో్యారని వక్ఫ్ బోర్డు, పిటిషనర్ల పై ఆగ్రహం
* వక్ఫ్ బోర్డు తీరుపై సీరియస్ కామెంట్లు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : వక్ఫ్ బోర్డు, పిటిషనర్ల తీరుపై హైకోర్టు (HIGH COURT) ఆగ్రహం వ్యక్తం చేసింది. దివ్య ఖురాన్ స్ఫూర్తిని వక్ప్ బోర్డు విస్మరించిందని జస్టిస్ నగేష్ భీమపాక (Justice Nagesh Bheemapaka) అన్నారు. పిటిషనర్ కూడా ఖురాన్ స్ఫూర్తిని మరచిపోయారని వ్యాఖ్యానించారు. పేదల పక్షాన వక్ఫ్ బోర్డు పనిచేయడం లేదని సీరియస్ కామెంట్లను చేశారు. పవిత్ర ఖురాన్లోని పేరాలను జస్టిస్ నగేష్ భీమపాక ఉటంకించారు. పాదరక్షలు విడిచి మరీ ఖురాన్లోని అంశాలను చదివి వినిపించారు. అనంతర కరుణామయుడు అల్లా అన్నారు. వక్ఫ్ బోర్డుపై గతేడాది హైకోర్టులో దాఖలైన పలు పిటిషన్లపై విచారణ జరిగింది. గతేడాది ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను అమలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇబాదత్ఖానాను స్వాధీనం చేసుకోవాలని హైకోర్టు గతేడాది మధ్యంతర ఉత్తర్వులను ఇచ్చింది. ఈమేరకు కమిటీ వేయాలని సూచించింది. నిర్వహణ కమిటీలో ఈక్వల్ మెంబర్స్ కు చోటు కల్పించాలని అన్నారు. మధ్యంతర ఉత్తర్వులు అమలు చేయకపోవడంపై ఆగ్రహించిన ధర్మాసనం.. ఖురాన్ (Khuran) లోని అంశాలను చదివి వినిపించారు.
………………………………………