వరంగల్ లోక్ సభ టికెట్ కడియం కావ్యకే..
* అధిష్టానం గ్రీన్ సిగ్నల్
* నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఎమ్మెల్యే కడియం శ్రీహరి ( Kadiam Srihari ) ఆయన కూతురు కావ్యతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆదివారం ఉదయం జూబ్లిహిల్స్‌లోని సీఎం రేవంత్ రెడ్డి ( CM Revanth Reddy) నివాసంలో శ్రీహరి, కావ్యలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జీ దీపాదాస్ మున్షీ కాంగ్రెస్ కండువాలు కప్పి ఆహ్వానించారు. దీంతో వరంగల్ పార్లమెంట్ టికెట్ కడియం కావ్యకు కెటాయించే అవకాశాలున్నాయి. ఈ ఒప్పందం మేరకే కాంగ్రెస్ పార్టీలో చేరారని కడియం శ్రీహరి ముఖ్య అనుచరులు చెబుతున్నారు. కాగా స్టేషన్ ఘన్పూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ సింగాపురం ఇందిర కడియం శ్రీహరి, కావ్యలు కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు కార్యకర్తలను ఇబ్బంది పెట్టారని, కడియం శ్రీహరిని కాంగ్రెస్‌లోకి ఆహ్వానించడాన్ని బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీకి వెళ్లనున్నారు.కరీంనగర్ , ఖమ్మం, వరంగల్ , హైదరాబాద్ స్థానాలకు ఇప్పటి వరకు అభ్యర్థులను ప్రకటించలేదు. అదే విదంగా సికింద్రాబాద్ స్థానానికి దానం నాగేందర్‌ను ప్రకటించారు. ఎంపీగా పోటీ చేయాలంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దానం నాగేందర్‌ను ఆదేశించింది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి వెనుకాడుతుండడంతో నాగేందర్ ను మార్చి వేరే వాళ్లకు అవకాశం ఇవ్వాలని చూస్తున్నట్టు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క , మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి లతో పాటు ఏఐసీసీ రాష్ట్ర ఇంచార్జీ దీపాదాస్ మున్షీ కూడా వెళుతున్నారు.ఈ రోజు ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి సెంట్రల్ ఎలక్షన్ కమిటీతో భేటీ అవుతారు. తెలంగాణలో మిగిలిన నాలుగు స్థానాలకు కూడా నేడో రేపో అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.
———————–
Related Stories
October 9, 2024
October 9, 2024