* కాంగ్రెస్ గూటికి కడియం శ్రీహరి, కావ్య…?
* బీఆర్ఎస్ వరంగల్ లోక్ సభ అభ్యర్థిగా ప్రకటించిన కేసీఆర్
* జిల్లాలోని నాయకుల సమన్వయం , సహకారం లేకపోవడం
* ఫోన్ ట్యాపింగ్, లిక్కర్ స్కాం లతో పార్టీ ప్రతిష్ట దిగజారింది
* కేసీఆర్కు లేఖ రాసిన కావ్య
ఆకేరు న్యూస్ , వరంగల్ : బీఆర్ ఎస్ పార్టీకి వరుస దెబ్బలు తాకుతున్నాయి. పార్టీ సెక్రటరీ జనరల్ గా ఉన్న కేశవరావు ఆయన కూతురు హైదరాబాద్ నగర మేయర్ విజయలక్ష్మీ లు పార్టీని వీడి ఈ నెల 30న కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఇపుడు వరంగల్ లోక్ సభ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు పార్టీ అధినేత కేసీఆర్కు లేఖ రాసింది. ఈ లేఖ సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది. బీఆర్ ఎస్పార్టీ నాయకులు, శ్రేణులు ఎవరూ కూడా సహకరించడం లేదని తెలుస్తోంది. ఇటీవలనే కేసీఆర్ను డాక్టర్ కడియం కావ్య కలిసింది. కాగా స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆయన కూతురు కావ్యతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని ప్రచారం జరుగుతోంది. కడియం కావ్యకు వరంగల్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందంటున్నారు. కావ్య కేసీఆర్ కు రాసిన లేఖలో కూడా తీవ్ర స్థాయిలో ఆరోపణలు ఉన్నాయి.అవినీతి, భూకబ్జాలు, ఫోన్ ట్యాపింగ్, లిక్కర్ స్కాం ల వల్ల పార్టీ ప్రతిష్ట బాగా దిగజారిపోయిందని పేర్కొన్నది. పార్టీ ని వీడాలని నిర్ణయించుకున్న తర్వాతనే ఇలాంటి తీవ్రస్థాయి వ్యాఖ్యలు చేశారన్నవాదన వినిపిస్తోంది.
—————————