
* కాజీపేట లోకో రన్నింగ్ డిపోలో సిబ్బంది కొరత కేంద్రం దృష్టికి
* వెంటనే ఖాళీలు భర్తీ చేయాలని వినతి
ఆకేరు న్యూస్, వరంగల్ : వరంగల్ ఎంపీ కడియం కావ్య స్థానిక సమస్యలపై లోక్సభలో గళమెత్తారు. కాజీపేట లోకో రన్నింగ్ డిపోలో సిబ్బంది కొరతపై లోక్ సభ(LOK SABHA)లో ప్రస్తావించారు. ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. 709 మంది ఉద్యోగులకు 526 మందే ఉన్నారని వివరించారు. మిగిలిన ఖాళీలను భర్తీ చేయాలని కేంద్ర రైల్వే మంత్రికి విజ్ఞప్తి చేశారు. కాగా కాజీపేట క్రూ డిపో కేంద్రంగా 2020లో 623 మంది లోకోపైలట్లతో నడిచింది. 2023 నవంబర్ నాటికి ఆ సంఖ్య 501కు తగ్గింది. 2025 మార్చి నాటికి ఆ సంఖ్య 470 పోస్టులకు పడిపోయింది. ఇలా అంతకంతకూ కాజీపేట క్రూ డిపో స్థాయి పడిపోతూ వస్తోంది. 2020 మేలో కేటాయించిన పోస్టుల సంఖ్య 790 కాగా, అధికారుల తాజా ఉత్వర్వులతో ఆ సంఖ్య 526కు పడిపోయింది. ఇదే అంశాన్ని ఎంపీ కావ్య (MP KAVYA) లోక్సభలో గొంతెత్తి చాటారు. ఖాళీలను భర్తీ చేసి, కాజీపేట రన్నింగ్ డిపోను కాపాడాలని ఎంపీ కేంద్రాన్ని కోరారు.
…………………………………………………..