
ఆకేరు న్యూస్, ములుగు:ములుగు జిల్లా కేంద్రంలో జిల్లా స్థాయిలో జరిగిన కళా ఉత్సవ్ కాంపిటీషన్లో తాడువాయి మండలం జడ్.పి.హెచ్.ఎస్ కాటాపూర్ విద్యార్థుల విజయ ప్రభంజనం సృష్టించారు .ఈ పాఠశాల విద్యార్థులు జిల్లాస్థాయిలో మూడు విభాగాల్లో మొదటి బహుమతి పొంది రాష్ట్రస్థాయికి ఎంపిక అయినట్లు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బి సుధాకర్ తెలిపారు.ఎంపికైన విద్యార్థులను గ్రామస్తులు పాఠశాల ఉపాధ్యాయులు అభినందించి ఘనంగా సన్మానించారు. వారికి సన్మాన పత్రాలు అందించారు. ఇందులో మూగ నాటికక (డ్రామా మైమ్) జిల్లా స్థాయిలో ప్రథమ బహుమతి వచ్చి రాష్ట్రస్థాయికి ఎంపికైన విద్యార్ధులు సాత్విక్, కార్తీక్ ,అఖిల్, నిఖిల్, ప్రణయ్ , సతీష్ ., విజువల్ ఆర్ట్స్ (డ్రాయింగ్ కాంపిటీషన్లో)జిల్లా మొదటి బహుమతి పొందిన విద్యార్ది M కార్తీక్ రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యాడువోకల్ మ్యూజిక్ గ్రూప్ సాంగ్ పాఠశాల విద్యార్థినిలు S శ్రీవిద్య , K అక్షిత అను విద్యార్థులు జిల్లా స్థాయిలో మొదటి బహుమతి పొంది రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు . హైదరాబాదులో జరగబోయే కళా ఉత్సవాలు పాల్గొంటారని పాఠశాల ప్రధానోపాధ్యాయులూ తెలిపారు. జిల్లాలోని అన్ని పాఠశాలలో కెల్లా ఉత్తమ ప్రతిభ కనబరిచే బహుమతులు పొందిన విద్యార్థులను శుభాకాంక్షలు తెలియజేసి ప్రశంస పత్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు ప్రధానోపాధ్యాయులు బానాల సుధాకర్ ,ఉపాధ్యాయులు సక్రనాయక్ ,అక్బర్ బాషా, జీవన్ లాల్, సమ్మయ్య ,సామ్సన్, పాపారావు ,వెంకటేశ్వర్లు, రాజేష్ జయపాల్ ,విజయ, శ్రీదేవి , మోహన్ , తదితరులు పాల్గొన్నారు.